Agniveer Posts: ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు అగ్నివీర్ పోస్టుల్లో అవ‌కాశం..!

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన వారికోసం భారత నౌకాదళం ఎంఆర్‌ విభాగంలో అగ్నివీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: అగ్నిఫథ్‌ స్కీ­మ్‌లో భాగంగా ఇండియన్‌ నేవీ ఈ నియామకాలు చేపట్టనుంది. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, ఫిజికల్, మెడికల్‌ టెస్టుల్లో అర్హత సాధించిన వారిని అగ్నివీరులుగా తీసుకుంటారు. ఈ విధంగా ఎంపికైన వారికి ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 02/2024 (నవంబర్‌ 24) బ్యాచ్‌ పేరున శిక్షణ ఉంటుంది. వీరు నాలుగేళ్ల పాటు ఇండియన్‌ నేవీలో సేవలు అందించవచ్చు. అనంతరం 25 శాతం మందిని పర్మింనెట్‌ ఉద్యోగులుగా తీసుకుంటారు. మిగతావారు అగ్నిపథ్‌ స్కీములో భాగంగా ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహాకాలతో ఉద్యోగం నుంచి వైదొలుగుతారు.

»    మొత్తం పోస్టులు: మెట్రిక్‌ రిక్రూట్‌–ఎంఆర్‌–
100 (ఇందులో మహిళలకు–20)
అర్హత
»    అగ్నివీర్‌ (ఎంఆర్‌): పదోతరగతి ఉత్తీర్ణులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
»    వయసు: అభ్యర్థి 01.11.2003 నుంచి 30.04.2007 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
»    ఎత్తు: అన్ని విభాగాలకు పురుషులు 157సెం. మీ. మహిళలలు 152 సెం.మీ ఉండాలి.ఎత్తుకు తగిని బరువు అవసరం. ఊపిరి పీల్చినప్పుడు, వదిలినప్పుడు ఛాతీ వ్యత్యాసం 5 సెం. మీ ఉండాలి.
ఎంపిక ఇలా
అప్లికేషన్‌ షార్ట్‌ లిస్టింగ్, స్టేజ్‌–1 (ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌), స్టేజ్‌–2(రాతపరీక్ష, శారీరక ధారుడ్య పరీక్ష), మెడికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంఆర్‌ రాత పరీక్ష
»    ఈ పరీక్షను ఆన్‌లైన్‌(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ రెండు విభాగాల నుంచి 50 ప్రశ్నలకు ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు.
»    రాత పరీక్షలో అర్హత సాధించినవారికి మాత్రమే స్టేజ్‌–2 పరీక్షలుంటాయి. ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు కూడా నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 
వీరికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్టులు, మెడికల్, ట్రైనింగ్‌ తదితర అన్ని నిబంధనలు అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) మాదిరిగానే ఉంటాయి.

Contract Jobs: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో జనరల్‌ వర్కర్‌ పోస్టులు..

ఫిజికల్‌ టెస్టులు
మొదటి దశ రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మాత్రమే ఫిజికల్‌ టెస్టులకు అవకాశం కల్పిస్తారు. ఫిజికల్‌ టెస్టులకు ఎంపికైన వారు నిర్దేశిత సెలక్షన్‌ కేంద్రాలకు ప్రవేశ పత్రాలతోపాటు అవసరమైన సర్టిఫికేట్లు, వాటి జిరాక్స్‌ సెట్, ఫోటోలు తదితర అవసరమైన పత్రాలను తీసుకెళ్లాలి.

రన్నింగ్‌ టెస్ట్‌
ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టులో భాగంగా 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 6 నిమిషాల 30 సెకన్లలో, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే పురుషులు 20, మహిళలు 15 గుంజీలు తీయగలగాలి. వీటితో పాటు పురుషులు 15 పుష్‌ అప్స్, మహిళలు10 పుష్‌ అప్స్‌; పురుషులు 15, మహిళలు 10 సిట్‌ అప్స్‌ తీస్తే ఫిజికల్‌ టెస్టులో అర్హత సాధిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి మాత్రమే మెడికల్‌ టెస్టులను నిర్వహిస్తారు. మెడికల్‌ టెస్టులో ఎంపికైన వారికి తుది ఎంపిక చేసి ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ఇస్తారు.

Lateral Entry Admissions: పాలిటెక్నిక్‌ లేటరల్‌ ఎంట్రీకి దరఖాస్తుల ఆహ్వానం

రాత పరీక్ష ప్రిపరేషన్‌ ఇలా
»    ప్రశ్నలన్నీ పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచే వస్తాయి. కాబట్టి అభ్యర్థులు సంబంధిత టాపిక్స్‌ను ప్రత్యేక దృష్టితో చదవాలి. సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి. మాక్‌ టెస్టులు రాయడం ద్వారా ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారో తెలుస్తుంది. 
»    ఇంగ్లిష్‌కు సంబంధించి వ్యాకరణాంశాలపై ప్ర­త్యేక దృష్టి పెట్టాలి. మేథమెటికల్‌ విభాగంలో మాదిరి ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 
»    జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి ఇటీవలి కాలంలో రక్షణశాఖలో తీసుకొచ్చిన నూతన సాంకేతిక, ఈ విభాగంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటితోపాటు స్పోర్ట్స్, అవార్డ్స్, బుక్స్, ఎన్నికలు తదితర తాజా పరిణామాలపైనా దృష్టి పెట్టాలి.

శిక్షణ
అగ్నివీర్‌లుగా ఎంపికైన వారికి ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో నవంబర్‌ నెలలో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

Five Government Medical Colleges: నాడు–నేడు ద్వారా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం

అగ్నివీర్‌ ప్రోత్సాహకాలు, సేవానిధి
ప్రతి నెల అగ్నివీరులు అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమచేస్తారు. మొత్తం నాలుగేళ్ల కాలానికి గానూ సేవా నిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని వేతనం నుంచి జమవుతాయి. అంతేమొత్తాన్ని ప్రభుత్వమూ జమచేస్తుంది. రెండు కలిపి రూ.10.04 లక్షలవుతాయి. దీనికి వడ్డిని జతచేసి అందజేస్తారు. దీంతోపాటు స్వయం ఉపాధి/వ్యాపారం నిమిత్తం వీరికి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. కార్పొరేట్‌ సంస్థల్లోనూ అవకాశాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీస్‌­లో మధ్యలో కావాలంటే..వైదోలిగే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భంలో వేతనం నుంచి జమ అయిన మొత్తాన్ని అగ్నివీరులకు అందిస్తారు. ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహం మాత్రం దక్కదు.

ఇతర ప్రయోజనాలు
అగ్నివీరులకు 30 వార్షిక సెలవులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలను బట్టి సిక్‌లీవ్‌లు కూడా ఇస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌ కాలంలో రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్, రేషన్, డ్రెస్, ట్రావెల్‌ అలవెన్సులు అందిస్తారు. నాలుగేళ్ల పాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గాను వారు పనిచేసిన విభాగాన్ని అనుసరించి అగ్నివీర్‌వాయు సర్టిఫికేట్‌ అందుతుంది. వీరికి ఫించను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ఎక్స్‌సర్వీస్‌మెన్‌ హోదా ఇవేవీ వర్తించవు. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌ ) ఉండదు.

ముఖ్యసమాచారం
»    దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    దరఖాస్తులకు చివరి తేదీ: 27.05.2024
»    ట్రైనింగ్‌ ప్రారంభ తేదీ: 2024 నవంబర్‌లో ప్రారంభం
»    వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

NDA and NA Notification: ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2024 నోటిఫికేష‌న్‌ విడుద‌ల.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ!

#Tags