Lateral Entry Admissions: పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీకి దరఖాస్తుల ఆహ్వానం
మురళీనగర్: ఇంటర్‌లో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో నేరుగా చేరడానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా సమన్వయాధికారి కచరపాలెం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు.
వీరు ప్రభుత్వ/ప్రయివేటు పాలిటెక్నిక్‌లలో నిర్వహిస్తున్న టెక్నికల్/నాన్ టెక్నికల్ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాది కోర్సులు చేరడానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు. దరఖాస్తులను ఈనెల 21నుంచి జూన్ 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో పంపించుకోవాలన్నారు. ప్రవేశాలకు సంబంధించి ఆప్షన్ల ఎంపిక జూన్ 10న నిర్వహిస్తామన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం https://apsbtet.in/ ivc/ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
డిప్లొమా ఫార్మసీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం : రెండేళ్ల డిప్లొమా ఫార్మసీ కోర్సులో చేరడానికి ఈనెల 21 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నారాయణరావు తెలిపారు. ఇంటర్ ఎంపీసీ/బైపీసీ కోర్సులు స్టేట్‌బోర్డు/సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ సిలబస్‌లో చదివినవారు అర్హులన్నారు. వీరు జూన్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు https://apsbtet.in/phar macy/ వెబ్‌సైట్‌లో చూడవచ్చని, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.