KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు మరో అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాల రిజిష్ట్రేషన్‌కు మరోసారి అవకాశం కల్పిస్తూ డిసెంబర్‌ 15న కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది.
ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు మరో అవకాశం 

యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. గతంలో రిజిష్ట్రేషన్‌ చేసుకోని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు యూనివర్సిటీ, ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఖాళీ సీట్లకు ఇప్పటికే ఉన్న ప్రవేశాల జీవోను సడలిస్తూ రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: KNRUHS: ఎంబీబీఎస్‌లోనే మూడుసార్లు ‘నెక్ట్స్‌’

అభ్యర్థులు నేరుగా డిసెంబర్‌ 17న కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in చూడాలని పేర్కొంది. 

చదవండి: KNRUHS: ‘బీ’ కేటగిరీ సీట్లకు తగ్గిన కటాఫ్‌

#Tags