AP Medical Seats: ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి ఏపీలో మ‌రో 150 ఎంబీబీఎస్‌ సీట్లు

రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, కాకినాడలలో మంత్రులు రజిని, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత ప‌ర్య‌టించారు.
Vidadhala rajini- Medical Seats

రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాలు, ప్రభుత్వాస్పత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను మంత్రి రజిని అడిగి తెలుసుకున్నారు. 

చ‌ద‌వండి: ఏపీ, తెలంగాణ‌లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ సీట్లు ఇవే 
ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాజమహేంద్రవరం మెడికల్‌ కాలేజీలో 150 ఎంబీబీఎస్‌ సీట్లకు అడ్మిషన్‌లు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాలల్లో మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. వీటిలో 750 సీట్లకు గాను 300 సీట్లకు అనుమతులు మంజూరు కాగా, మిగతా 450 సీట్లకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతులు రావాల్సి ఉందన్నారు.

చ‌ద‌వండి: NEET UG 2022 Cutoff: నీట్‌ నిరాశ పరిచినా.. మరెన్నో మార్గాలు!!

చ‌ద‌వండి: NEET UG 2022 All India 5th Ranker : చదివిన కొద్దిసేపైనా ఇలా చ‌దివే వాడిని.. నా ల‌క్ష్యం ఇదే..

#Tags