Skip to main content

NEET UG Admit Card 2024: నీట్‌ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

NEET UG Admit Card 2024   National Testing Agency

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే NEET UG- 2024 అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో NEET అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

NEET UG  పరీక్ష షెడ్యూల్‌

దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య ఈ పరీక్ష జరగనుంది. నీట్‌ పరీక్షకు ఈసారి 24లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఎంబీబీఎస్‌(MBBS), బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు. విద్యార్థులు  https://exams.nta.ac.in/NEET/ డైరెక్ట్‌ లింక్‌ క్లిక్‌ చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
 

Published date : 02 May 2024 12:42PM

Photo Stories