Posts at AIIMS : గుజ‌రాత్‌లోని ఎయిమ్స్‌లో వివిధ విభాగాల్లో సీనియ‌ర్ రెసిడెంట్ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

రాజ్‌కోట్‌ (గుజరాత్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌–అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 48.
»    విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ తదితరాలు.
»    అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.07.2024.
»    వెబ్‌సైట్‌: https://aiimsrajkot.edu.in

Engineering Seats: 2,640 ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు.. మరో 4 వేల సీట్లకు చాన్స్‌..

#Tags