Pharmacist Grade 2 Posts : తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టులు.. అర్హులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్‌–హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ).. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌/డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌లో, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ అండ్‌ రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌లలో ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

    మొత్తం పోస్టుల సంఖ్య: 633.
    పోస్టుల వివరాలు: డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌/డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌–445,తెలంగాణ వైద్య విధాన పరిషత్‌–185, ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ అండ్‌ రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌–02.
    అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్‌ డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని ఉండాలి.
    వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు,ఎన్‌సీసీ,ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
    పే స్కేల్‌: నెలకు రూ.31,040 నుంచి రూ.92,050.
    ఎంపిక విధానం: రాతపరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేసినవారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు.
    పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్‌ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట.
Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
ముఖ్య సమాచారం
    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.10.2024.
    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.10.2024
    దరఖాస్తు సవరణ తేదీలు: 23.10.2024 నుంచి 24.10.2024 వరకు 
    పరీక్ష తేది: 30.11.2024.
    వెబ్‌సైట్‌: http://https//mhsrb.telangana.gov.in

TG DSC 2024 Certificate Verification Required Documents : డీఎస్సీ సర్టిఫికేట్‌ వెరిఫికేషన్ ప్రారంభం.. కావాల్సిన సర్టిఫికెట్స్‌ ఇవే...

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags