Permanent Employees: వైద్యారోగ్యశాఖలో పర్మెనెంట్‌ అయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా ప్రారంభమైన వారిని ఇప్పుడు పర్మెనెంట్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏఏ విభాగాల్లో ఉద్యోగులను పర్మెనెంట్‌ చేసారో వివరాలను తెలిపారు.

ఏలూరు: వైద్యారోగ్యశాఖలో 185 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తూ సోమవారం కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ ఉత్తర్వులు అందజేశారు. ముందుగా డీఎంహెచ్‌ఓ శర్మిష్ట మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 269 కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రతిపాదనలు పంపంగా 185 మందిని పర్మినెంట్‌ ఉద్యోగులుగా గుర్తించారన్నారు.

Language Training: ఇక్కడ శిక్షణ.. జపాన్‌లో ఉద్యోగం

వీటిలో జీఓఎంఎస్‌ నం.30 ప్రకారం 161 హెల్త్‌ అసిస్టెంట్లు (పురుషులు)ను ప్రతిపాదించగా 114 మందిని ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ 14 మందికి ఒకరు, ఫార్మాలాజిస్టు 14 మందికి 9 మందిని క్రమబద్ధీకరించారన్నారు. అలాగే జీఓఎంఎస్‌ నం.31 ప్రకారం 78 మంది ఏఎన్‌ఎం (మహిళలు)ను ప్రతిపాదించగా 61 మందిని రెగ్యులర్‌ చేశారన్నారు. జేసీ లావణ్యవేణి, డీఐఈ నాగేశ్వరరావు, డీసీహెచ్‌ డా.పాల్‌ సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

#Tags