Fulcrum Digital: ఈ స్కిల్ మీలో ఉందా.. అయితే ఉద్యోగం వ‌చ్చిన‌ట్టే..!

2024లోనూ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ఈ క్రమంలో.. డిజిటల్ ఇంజినీరింగ్, బిజినెస్ ప్లాట్‌ఫామ్ సేవల సంస్థ 'ఫుల్‌క్రమ్ డిజిటల్' (Fulcrum Digital) మాత్రం కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు శుభవార్త చెప్పింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ డొమైన్‌లలో 700 మందిని నియమించుకోవాలని యోచిస్తోందని ఫుల్‌క్రమ్ డిజిటల్ కంపెనీ ఛైర్మన్ 'రాజేష్ సిన్హా' తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను మరింత సులభతరం చేయడానికి ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ ఆసక్తి చూపుతోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా, డేటా సైన్టిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ వంటి టెక్నాలజీలలో నైపుణ్యం కలిగిన వారిని కూడా సంస్థ ఈ ఏడాది నియమించుకోనుంది. న్యూయార్క్‌కు చెందిన ఫుల్‌క్రమ్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ కార్యాలయాలు లాటిన్ అమెరికా, యూరప్, ఇండియాలలో కూడా ఉన్నాయి.

కొత్త టెక్నాలజీ అవసరం..
రోజు రోజుకి కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులు కూడా తప్పకుండా కొత్త టెక్నాలజీలలో నైపుణ్యం పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలుగుతారో.. అప్పుడే సంస్థల్లో మనగలుగుతారు. లేకుంటే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. టెక్నాలజీలలో నైపుణ్యం లేకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల గత నెలలో ఏకంగా 32 వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఉద్యోగి తన నైపుణ్యం పెంచుకోవాలి.

Microsoft: ఏఐలో 20 లక్షల మందికి శిక్షణ..

#Tags