Guest Lecturer Posts: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కందనూలు: మైనార్టీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ మైనారిటీ యువతీ, యువకులకు జులై 25న మున్సిపల్‌ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ పరిధిలో ఇది వరకే మైనారిటీ రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు మున్సిపల్‌ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సకాలంలో హాజరు కావాలని కోరారు.

Digital Classes: డిజిటల్‌ బడులు.. దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలో

నేడు లక్కీడిప్‌ ద్వారా విద్యార్థుల ఎంపిక
కందనూలు: బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలో ప్రవేశాలకు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో జులై 21వ తేదీన కలెక్టర్‌లో ఉదయం 11గంటలకు లక్కీ డీప్‌ ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రామ్‌లాల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతిలో 88 సీట్లకు 214 దరఖాస్తులు, 5లో 90 సీట్లకు 419 దరఖాస్తులు మొత్తం 633 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లా నూతన కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ నియమించిన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు, అనంతరం జాబితాను అదే రోజున ప్రకటిస్తారని, విద్యార్థుల తల్లిదండ్రులు నిర్ణీత సమయంలోగా హాజరుకావాలని తెలిపారు.

English Language Learning: ఆంగ్లంపై పట్టు.. ఆత్మస్థైర్యానికి మెట్టు

గెస్ట్‌ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కొల్లాపూర్‌: కొల్లాపూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కే.మల్లేశం వెల్లడించారు. 2023–24 విద్యాసంవత్సరానికి ఇంగ్లీష్‌, తెలుగు, చరిత్ర, రాజనీతిశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌, కామర్స్‌ సబ్జెక్టులు బోధించేందుకు జులై 24వ తేదీ వరకు అధ్యాపకులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. జనరల్‌ అభ్యర్థులకు పీజీలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం మార్కులు ఉండాలన్నారు. పీహెచ్‌డీ, సెట్‌, నెట్‌ అర్హతలతో పాటు, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందన్నారు. దరఖాస్తుదారులు తమ అర్హత పత్రాలను కళాశాలలో అందించాలని సూచించారు.

Telangana Teaching Jobs: డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు... ఖాళీల వివరాలు ఇవే

పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
నాగర్‌కర్నూల్‌రూరల్‌: కేజీబీవీ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఈ మేరకు డీఈఓ గోవిందరాజులుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పెంట్లవెల్లి, కేజీబీవీ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రవి, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలు వాయిదా
మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్‌ గిరిజామంగతాయారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురుస్తుండటం వల్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నామన్నారు. సెలవుల అనంతరం పరీక్ష షెడ్యూల్‌ను మళ్లీ ప్రకటిస్తామని, ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.

#Tags