Skip to main content

Telangana Teaching Jobs: డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు... ఖాళీల వివరాలు ఇవే

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల స్థానాలను గెస్ట్‌ లెక్చరర్లతో భర్తీ చేయనున్నారు.
Degree-lecturer-jobs

ఖమ్మం సహకారనగర్‌/సత్తుపల్లి టౌన్‌/నేలకొండపల్లి: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల స్థానాలను గెస్ట్‌ లెక్చరర్లతో భర్తీ చేయనున్నారు.

Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

ఖాళీల వివరాలు

  • ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఐదు, ఇంగ్లిష్‌ నాలుగు, బీబీఏ, బీసీఏ, కెమిస్ట్రీ రెండు పోస్ట్‌లతో పాటు స్టాటిస్టిక్స్‌ పోస్టు ఒకటి ఖాళీగా ఉందని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకీరుల్లా ఒక ప్రకటనలో తెలిపారు.
  • సత్తుపల్లి జేవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, ఇంగ్లిష్‌, డెయిరీ సైన్స్‌, హిస్టరీ సబ్జెక్టు అధ్యాపకుల పోస్టులు
  • నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్‌, పొలిటికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టు అధ్యాపకుల పోస్టులు 

ICMR-NIN Hyderabad Jobs 2023: 116 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

అర్హతలు

సంబంధిత సబ్జెక్టులో ఎస్సీ, ఎస్టీలైతే పీజీలో 50 శాతం, ఇతరులు 55 శాతం మార్కులు కలిగి ఉండాలని, నెట్‌, స్లెట్‌, పీహెచ్‌డీతోపాటు బోధనానుభవం ఉన్న వారికి ప్రాధ్యానత ఉంటుందని పేర్కొన్నారు.

ఆసక్తి ఉన్నవారు అన్ని సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుని నిర్దేశిత తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత కళాశాలల్లో సంప్రదించాలని తెలిపారు.

Telangana Jobs 2023: 156 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Published date : 20 Jul 2023 01:30PM

Photo Stories