Telanagana Group 3 Post Details: గ్రూప్‌ 3 పోస్టుల వివరాలు.... ఎలా సన్నద్ధమవ్వాలో తెలుసా.?

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) 1365 గ్రూప్‌–3 పోస్టుల భర్తీ ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. అలాగే నోటిఫికేషన్ కూడా విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సాగిస్తే.. విజ‌యం ఈజీగా సాధించే అవ‌కాశం ఉంటుంది.

గ్రూప్‌ 3 పోస్టుల వివరాలు... పరీక్ష ఎలా నిర్వహించనున్నారు... పేపర్‌ 1 సిలబస్‌ మీకోసం....
గ్రూప్‌–3 పోస్టులు ఇవే...
గ్రూప్‌–3లో సీనియర్‌ అకౌంటెంట్, ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), సీనియర్‌ ఆడిటర్, అసిస్టెంట్‌ ఆడిటర్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్, గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్, హెచ్‌వోడీల్లోని సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అకౌంటెంట్, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు ఉన్నాయి.
పేపర్‌ 1 ఇలా....
గ్రూపు 3లో భాగంగా నిర్వహించే పేపర్‌ 1 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. సమయం 150 నిమిషాలు. ఇందులో జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఈ అంశాలను కవర్‌ చేయాల్సి ఉంటుంది.
– ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు
– అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
– జనరల్‌ సైన్స్‌, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు
– పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ – నివారణ, తీవత్రను తగ్గించే వ్యూహాలు
– ప్రపంచ భూగోళశాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళ శాస్త్రం
– భారతదేశ చరిత్ర, సాంçస్కృతిక వారసత్వం
– తెలంగాణ సమాజం, సంస్కృ, వారసత్వం, కళలు, సాహిత్యం
తెలంగాణ రాష్ట్ర విధానాలు
 సామాజిక వెనుకబాటు, హక్కులకు సంబంధించిన అంశాలు, సమీకృత విధానాలు
 లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, బేసిక్‌ ఇంగ్లిష్‌ (8వ తరగతి స్థాయి)

➤ Group 3 Preparation Plan: గ్రూప్‌ 3లో జాబ్‌ కొట్టాలనుకుంటున్నారా... పేపర్‌ 2కి ఇలా సన్నద్ధమవ్వండి

☛ Group 3 Paper 3 Syllabus: గ్రూప్‌ 3 ... పేపర్‌–3కి ఇలా సన్నద్ధమవ్వండి

#Tags