Skip to main content

Group 3 Paper 3 Syllabus: గ్రూప్‌ 3 ... పేపర్‌–3కి ఇలా సన్నద్ధమవ్వండి

గ్రూప్‌ 3 పరీక్షకు సంబంధించి పేపర్‌ 3కూడా ముఖ్యమైనదే. కొంచెం పట్టుసాధిస్తే మంచి స్కోర్‌ సాధించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధికి సంబంధిన అంశాలపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.

అభ్యర్థులు సమయానుకూలంగా చదివితే ఇందులో మంచి మార్కులే సాధించొచ్చు. పేపర్‌ 3 మొత్తం 150 మార్కులకు ఉంటుంది. సమయం 150 నిమిషాలు. 
భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్లు...
– ప్రగతి, అభింవృద్ధి: భావనలు, పరస్పర సంబంధం.
– ఆర్థికాభివృద్ధి గణన: జాతీయాదాయం, నిర్వచనం, జాతీయాదాయ గణనకు సంబంధించిన భావనలు, పద్ధతులు, నామమాత్ర, వాస్తవ ఆదాయం.
– పేదరికం, నిరుద్యోగం: పేదరికం భావనలు – ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయ రహిత పేదరికం, పేదరికాన్ని గణించే విధానం, నిరుద్యోగం– నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
– భారత ఆర్థిక ప్రణాళిక: పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, వ్యూహాలు, విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక; సమ్మిళిత వద్ధి, నీతి ఆయోగ్‌.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివద్ధి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (1954–2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దుర్వినియోగం 
– నీళ్లు (బచావత్‌ కమిటీ), నిధులు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి కల్పన (జై భారత్‌ కమిటీ, గిర్‌గ్లాన్‌ కమిటీ).
– తెలంగాణలో భూ సంస్కరణలు: మధ్యవర్తిత్వ విధానాల నిర్మూలన – జమీందారీ, జాగిర్దారీ, ఇనాందారీ, టెనాన్సీ విధానాలు, భూ పరిమితి, షెడ్యూల్డ్‌ ఏరియాల్లో ల్యాండ్‌ ఎలియేషన్‌.
– వ్యవసాయం, సంబంధిత రంగాలు: జీఎస్‌డీపీలో వ్యవసాయం, సంబంధిత రంగాల పాత్ర, భూ పంపిణీ, వ్యవసాయంపై ఆధారం, నీటి పారుదల, జల వనరులు, మెట్ట భూముల్లో సాగు ఇబ్బందులు.
– పారిశ్రామిక, సేవా రంగాలు: పారిశ్రామిక అభివద్ధి; పారిశ్రామిక ప్రగతి, నిర్మాణం – చిన్న, సూక్ష్మ తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ); పారిశ్రామిక అవస్థాపనా సౌకర్యాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం, సేవా రంగం నిర్మాణం, ప్రగతి. 
అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, పరిణామాలు : 
– అభివృద్ధిలో గతిశీలత: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు – కులం, తెగ, లింగ, మత ప్రాతిపదిక అసమానతలు; వలసలు, పట్టణీకరణ.
– అభివృద్ధి, స్థానచలనం: భూసేకరణ విధానం; పునరుద్ధరణ, పునరావాసం
– ఆర్థిక సంస్కరణలు: ప్రగతి, పేదరికం, అసమానతలు–సాంఘిక అభివృద్ధి (విద్య, ఆరోగ్యం), సామాజిక రూపాంతరత, సాంఘిక భద్రత.
– సుస్థిర అభివృద్ధి: భావనలు, గణన, లక్ష్యాలు.

Published date : 14 Dec 2022 06:51PM

Photo Stories