Group 3 Preparation Plan: గ్రూప్ 3లో జాబ్ కొట్టాలనుకుంటున్నారా... పేపర్ 2కి ఇలా సన్నద్ధమవ్వండి
కాబట్టి సిలబస్ ఎక్కువ అని భయపడకుండా... మొదటగా కష్టంగా ఉండేవాటి మీద దృష్టి పెట్టి తర్వాత సులభంగా ఉండే సబ్జెట్‌లను చదవడం మంచిది. పేపర్ 2 మొత్తం 150 మార్కులకు ఉంటుంది. సమయం 150 నిమిషాలు. ఇందులో ప్రధానంగా చరిత్ర, పాలిటీ, సమాజం గురించిన అంశాలపై ప్రశ్నలుంటాయి.
– తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు
– శాతవాహనులు
– ఇక్ష్వాకులు
– విష్ణుకుండినులు
– ముదిగొండ, వేములవాడ, చాళుక్యులు, వారి సాంస్కృతిక సేవ;
– సాంఘిక వ్యవస్థ
– మత పరిస్థితులు
– పురాతన తెలంగాణలో బుద్ధిజం, జైనిజం
– భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం, కాకతీయ రాజ్య స్థాపన, సామాజిక, సాంçస్కృతిక అభివృద్ధికి వారి సేవ
– కాకతీయుల పాలనా కాలంలో తెలుగు భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం, సృజనాత్మక కళలు
– రాచకొండ, దేవరకొండ వెలమలు – సాంఘిక, మత పరిస్థితులు
– తెలుగు భాషా, సాహిత్యాభివద్ధి
– కాకతీయులకు వ్యతిరేకంగా నిరసనోద్యమాలు: సమ్మక్క–సారక్క నిరసన
– కుతుబ్‌షాహీల సామాజిక, సాంస్కృతిక సేవ, భాష, సాహిత్యం, వాస్తుశాస్త్రం, పండగలు, నాట్యం, సంగీతం, కళల అభివద్ధి
– మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం.
– అసఫ్‌జాహీ రాజవంశం
– నిజాం–బ్రిటిష్ సంబంధాలు: సాలార్‌జంగ్ సంస్కరణలు, వాటి ప్రభావం;
– నిజాంల పాలనాకాలంలో సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు: విద్యా సంస్కరణలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన, ఉన్నత విద్య
– ఉపాధి వృద్ధి, మధ్య తరగతి వృద్ధి
– తెలంగాణ – సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పునర్జీవనం
– ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభల పాత్ర
– ఆంధ్రసారస్వత పరిషత్, అక్షరాస్యత, గ్రంథాలయ ఉద్యమాలు, ఆది–హిందూ ఉద్యమం, ఆంధ్ర మహిళా సభ, మహిళా ఉద్యమ ప్రగతి
– గిరిజనోద్యమాలు, రామ్‌జీ గోండ్, కొమురం భీమ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం; కారణాలు, పరిణామాలు.
– ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం
– ముల్కీ ఉద్యమం (1952 –56)
– ప్రత్యేక రక్షణల ఉల్లంఘన, ప్రాంతీయ అసమానత, తెలంగాణ ఉనికి ప్రకటన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన (1969–70)– వివక్షకు వ్యతిరేకంగా బలపడిన నిరసన, తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఉద్యమాలు (1971– 2014).
పాలిటీకి సంబంధించి....
– భారత రాజ్యాంగం, రాజకీయాలు – పరిశీలన
– భారత రాజ్యాంగం – పరిణామ క్రమం, స్వభావం, ఉన్నత లక్షణాలు, ప్రవేశిక
– ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు
– భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలనాపరమైన అధికారాల విభజన.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు – రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి – అధికారాలు, విధులు.
– 73వ, 74వ రాజ్యాంగ సవరణలు – గ్రామీణ, పట్టణ పరిపాలన
– ఎన్నికల విధానం: స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు.
– భారత దేశంలో న్యాయ వ్యవస్థ – న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
ఎ) షెడ్యూల్డ్ కులాలు, తరగతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు
బి) సంక్షేమం అమలు విధానం – షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్,
– షెడ్యూల్డ్ తరగతుల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్.
భారత రాజ్యాంగం... నూతన సవాళ్లు :
– సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు
– భారత దేశ సామాజిక నిర్మాణం: భారతీయ సమాజం ప్రధాన లక్షణాలు: కులం, కుటుంబం, పెళ్లి, బంధుత్వం, మతం, తెగ, మహిళ, మధ్య తరగతి;
– తెలంగాణ సమాజం సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.
– సామాజిక సమస్యలు: అసమానత్వం, బహిష్కరణ: కులతత్వం, కమ్యూనలిజం, ప్రాంతీయతత్వం, మహిళలపై హింసాత్మకత, బాలకార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా, వైకల్యం, వృద్ధాప్యం.
– సామాజిక ఉద్యమాలు: రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
– తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సమస్యలు: వెట్టి, జోగినీ, దేవదాసి వ్యవస్థలు, బాలకార్మిక వ్యవస్థ, బాలికా సమస్యలు (గర్ల్ చైల్డ్), ఫ్లోరోసిస్, వలసలు, రైతులు, నేత కార్మికుల బాధలు.
– సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించి ప్రత్యేక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు: ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ, పట్టణ, మహిళా, పిల్లల సంక్షేమం, గిరిజన సంక్షేమం.