TSPSC Group-2 Notification : 726 గ్రూప్‌-2 పోస్టుల‌కు డిసెంబర్‌లో నోటిఫికేష‌న్‌..? ప‌రీక్షావిధానం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి.

ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు విడ‌ద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇందులో పోలీస్‌, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అలాగే డిసెంబ‌ర్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ది. గ్రూప్‌-2లో భాగంగా 726 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Telangana Government Jobs : పెరగనున్న గ్రూప్‌-2, 3, 4 పోస్టులు ఇవే.. ఉత్తర్వులు జారీ..

గ్రూప్‌-2లోని పోస్టులు ఇవే..

గతంలో గ్రూప్‌-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 726కు చేరింది. మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్, డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌), సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి), ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (పీఆర్‌), అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండోమెంట్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌  ఆఫీసర్‌ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్‌, లా).

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్

ప్రస్తుతం గ్రూప్‌–2 కేటగిరీలో పై 16 రకాల పోస్టులుండగా.. ఇందులో మరో 6 రకాల పోస్టులను చేర్చింది. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (తెలంగాణ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ సర్విస్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఇతర ప్రభుత్వ శాఖలు), డ్రిస్టిక్ట్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ (జువైనల్‌ కరెక్షనల్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (బీసీ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌ సబ్‌ సర్వీస్‌), అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ (ఎస్సీడీడీ సబ్‌ సర్వీస్‌) ఉద్యోగాలు ఇకపై గ్రూప్‌–2 సర్విసుల్లోకి వస్తాయి.

చ‌ద‌వండి: TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2 ప‌రీక్షావిధానం :

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు ఇంట‌ర్య్వూ విధానం ఉండేది. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేసింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్‌–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌–2 ప‌రీక్ష సిల‌బ‌స్ కింది మేర‌కు ఉంటుంది.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 600

రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌) :

పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు సమయం (గంటలు) మార్కులు
1 జనరల్‌ స్టడీస్, జనరల్‌ సైన్స్‌ 150  2 1/2 150
2 హిస్టరీ, పాలిటీ     అండ్‌ సొసైటీ                        
  1. భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర
  2. భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం (ఓవర్‌ వ్యూ)
  3. సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీస్‌
150 2 1/2 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌                        
  1. భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  3. ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌
150 2 1/2 150
4 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం                        
  1. తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970)
  2. మద్దతు కూడగట్టే దశ (1971–1990)
  3. తెలంగాణ ఏర్పాటు దిశగా..(1991–2014)
150 2 1/2 150

TSPSC: 9,168 గ్రూప్‌–4 పోస్టులు.. శాఖల వారీగా పోస్టుల వివరాలివీ..

#Tags