Skip to main content

TSPSC: 9,168 గ్రూప్‌–4 పోస్టులు.. శాఖల వారీగా పోస్టుల వివరాలివీ..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌–4 ఉద్యోగ నియామకాలకు లైన్‌క్లియర్‌ అయింది. మొత్తం 9,168 గ్రూప్‌–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
TSPSC
9,168 గ్రూప్‌–4 పోస్టులు.. శాఖల వారీగా పోస్టుల వివరాలివీ..

. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు నవంబర్‌ 25న ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడతామన్న ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలకు అనుమతులు ఇచ్చింది. కొన్నింటికి నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. ఇందులో అత్యధికం పోలీసుశాఖకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా ఉన్నవి గ్రూప్‌–4 ఉద్యోగాలే. మరో 9,096 పోస్టులు గురుకుల నియామకాల బోర్డు పరిధిలో ఉన్నాయి. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్

శాఖల వారీగా ప్రతిపాదనలు 

రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 9,168 గ్రూప్‌–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు ముందుగా టీఎస్‌పీఎస్సీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. శాఖల వారీగా మంజూరు చేసిన పోస్టులకు సంబంధించి రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలను టీఎస్‌పీఎస్సీ పూర్తిస్థాయిలో పరిశీలిస్తుంది. అన్ని అంశాలు లోపాలకు తావులేకుండా ఉన్నట్టు సంతృప్తి చెందిన తర్వాత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. ప్రస్తుతం గ్రూప్‌–4 కేటగిరీలో భర్తీకి అనుమతించిన మొత్తం 9,168 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ వెలువనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల్లో వివిధ ఉద్యోగాలు కలిపి సగానికిపైగా మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలోనే ఉండటం గమనార్హం. గ్రూప్‌–4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇక సాధన మొదలుపెట్టి కొలువు దక్కించుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రా>వు శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా పిలుపునిచ్చారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్‌–4 పోస్టుల వివరాలివీ.. 

1) జూనియర్‌ అకౌంటెంట్లు: 429 
ఆర్థికశాఖ: 191 (డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌–35, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌–156) 
మున్సిపల్‌ శాఖ: 238 (సీడీఎంఏ–224, హెచ్‌ఎండీఏ–14) 

2) జూనియర్‌ అసిస్టెంట్లు: 6,859 
వ్యవసాయశాఖ: 44 (డైరెక్టర్‌ కార్యాలయం–2, కోఆపరేటివ్‌ రిజి్రస్టార్‌–4, అగ్రికల్చర్‌ కమిషనర్‌–4, హారి్టకల్చర్‌ వర్సిటీ–34, పశుసంవర్థక శాఖ–2, మత్స్యశాఖ–2) 
బీసీ సంక్షేమశాఖ: 307 (డైరెక్టర్‌ కార్యాలయం–7, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ–289, బీసీ సహకార సమాఖ్య–11) 
పౌర సరఫరాలశాఖ: 72 (డైరెక్టర్‌ కార్యాలయం–25, లీగల్‌ మెట్రాలజీ–1, సివిల్‌ సప్‌లైస్‌ కార్పొరేషన్‌–46) 
ఇంధనశాఖ: 2 (చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం) 
అటవీ, పర్యావరణ శాఖ: 23 (పీసీసీఎఫ్‌ కార్యాలయం) 
ఆర్థిక శాఖ: 46 (డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్, అకౌంట్స్‌) 
సాధారణ పరిపాలన శాఖ: 5 (పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ కార్యాలయం) 
వైద్య, ఆరోగ్యశాఖ: 338 (టీవీవీపీ కార్యాలయం–119, ఆయుష్‌ కమిషనర్‌–10, డ్రగ్స్‌ కంట్రోల్‌–2, వైద్య విద్య–125, ప్రజారోగ్య శాఖ–81, ఐపీఎం–1) 
ఉన్నత విద్యాశాఖ: 742 (కళాశాల విద్య కమిషనరేట్‌–36, ఇంటరీ్మడియట్‌ కమిషనర్‌–68, సాంకేతిక విద్య కమిషనర్‌–46, ఓపెన్‌ యూనివర్సిటీ–26, జేఎన్‌యూఎఫ్‌ఏ–2, జేఎన్‌టీయూ–75, కాకతీయ వర్సిటీ–10, మహాత్మాగాందీ–4, ఉస్మానియా–375, పాలమూరు–8, తెలుగు యూనివర్సిటీ–47, ఆర్‌జీయూకేటీ–31, శాతవాహన–8, తెలంగాణ వర్సిటీ–6) 
హోంశాఖ: 133 (డీజీపీ–88, జైళ్లశాఖ–18, అగ్నిమాపకశాఖ–17, డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్స్‌–8, సైనిక్‌ వెల్ఫేర్‌–2) 
పరిశ్రమలశాఖ: 7 (కమిషనరేట్‌–4, మైన్స్, జియాలజీ–3) 
సాగునీటి శాఖ: 51 (భూగర్భజల శాఖ–1, ఈఎన్‌సీ–పరిపాలన–50) 
కార్మికశాఖ: 128 (ఉపాధి, శిక్షణ శాఖ–33, కార్మిక కమిషనర్‌–29, బాయిలర్స్‌ డైరెక్టర్‌–1, ఫ్యాక్టరీస్‌–5, ఇన్సూరెన్స్ మెడికల్‌ సర్విసెస్‌–60) 
మైనార్టీ సంక్షేమశాఖ: 191 (మైనార్టీ సంక్షేమ డైరెక్టర్‌–06, మైనార్టీ గురుకులాలు–185) 
పురపాలకశాఖ: 601 (సీడీఎంఏ–172, టౌన్‌ప్లానింగ్‌–03, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ–2, జీహెచ్‌ఎంసీ–202, హెచ్‌ఎండీఏ–50, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌–167, కుడా–05) 
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ: 1,245 (కమిషనర్‌ పరిధిలో–1,224, ఈఎన్‌సీ (జనరల్‌ అండ్‌ పీఆర్‌)–11, ఈఎన్‌సీ మిషన్‌ భగీరథ–10) 
ప్రణాళికశాఖ: 02 (అర్థగణాంక శాఖ డైరెక్టర్‌–02) 
రెవెన్యూ శాఖ: 2,077 (స్టాంపులు, రిజి్రస్టేషన్లు–40, భూపరిపాలన శాఖ–1,294, వాణిజ్య పన్నులు–655, దేవాదాయ–09, ఎక్సైజ్‌–72, సర్వే సెటిల్‌మెంట్‌–7) 
ఎస్సీ అభివృద్ధి శాఖ: 474 (కమిషనర్‌ ఎస్సీల అభివృద్ధి శాఖ–13, ఎస్సీ సహకార కార్పొరేషన్‌–115, ఎస్సీ గురుకులాలు–346) 
మాధ్యమిక విద్యాశాఖ: 97 (డీఎస్‌ఈ–20, వయోజన విద్య–2, గ్రంథాలయాలు–9, మోడల్‌ స్కూళ్లు–14, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ–9, టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌–39, జిల్లా గ్రంథాలయాల సంస్థ–4) 
రోడ్డు, రవాణాశాఖ: 20 (రవాణా కమిషనర్‌–11, ఈఎన్‌సీ ఆర్‌అండ్‌బీ–09) 
గిరిజన సంక్షేమ శాఖ: 221 (సీఈ ట్రైబల్‌ వెల్ఫేర్‌–04, కమిషనర్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌–11, జీసీసీ–65, ట్రైకార్‌–08, ఎస్టీ గురుకులాలు–132, టీసీఆర్‌అండ్‌టీఐ–1) 
మహిళాశిశు సంక్షేమశాఖ: 18 (జువెనైల్‌ వెల్ఫేర్‌–09, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం–03, మహిళాశిశు సంక్షేమం–06) 
యువజన, సాంస్కృతికశాఖ:13 (భాష సంస్కృతి–02, ఎన్‌సీసీ–11) 

3) జూనియర్‌ ఆడిటర్‌: 18 (డైరెక్టర్‌ స్టేట్‌ ఆడిట్‌) 
4) వార్డ్‌ ఆఫీసర్‌: 1,862 (మున్సిపల్‌ శాఖ) 

చదవండి: Success Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. నేడు డీఎస్పీ ఉద్యోగం సాధించానిలా..

విధుల వారీగా పోస్టుల లెక్కలివీ..

జూనియర్‌ అసిస్టెంట్లు

6,859

వార్డ్‌ ఆఫీసర్‌

1,862

జూనియర్‌ అకౌంటెంట్లు

429

జూనియర్‌ ఆడిటర్‌

18

మొత్తం పోస్టులు

9,168

Published date : 26 Nov 2022 02:46PM

Photo Stories