TET/DSC ప్రత్యేకం సైన్స్ మెథడాలజీ Bit Bank
1. ఉపాధ్యాయుడు తను బోధనా లక్ష్యాలను ఎంతవరకు సాధించగలుగుతున్నాడో తెలుసుకోవడానికి వాడే ప్రక్రియ?
1) బోధనా పద్ధతి
2) బోధనా ఉద్దేశం
3) మూల్యాంకనం
4) ఉన్ముఖీకరణ
- View Answer
- Answer: 3
2. మూల్యాంకనంలో పరస్పరం ఆధారపడిన అంశాల్లో.. అభ్యసనా అనుభవాలు, మూల్యాంకనం సాధనాలతోపాటు ఉండేది?
1) లక్ష్యాలు
2) బోధనోపకరణాలు
3) బోధనా పద్ధతులు
4) పరీక్షలు
- View Answer
- Answer: 1
3. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ, మొత్తం విద్యావ్యవస్థలో ఒక సమైక్య భాగమై విద్యకు అన్ని లక్ష్యాల తోనూ దగ్గర సంబంధం ఉంటుంది అని తెలిపినవారు?
1) కొఠారి కమిషన్
2) మొదలియార్ కమిషన్
3) తారాదేవి రిపోర్ట్
4) రాధాకృష్ణన్ కమిషన్
- View Answer
- Answer: 1
4. ప్రాచీన పరీక్షా విధానం కేవలం ఏ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చింది?
1) మానసిక చలనాత్మక రంగం
2) భావావేశ రంగం
3) క్రీడా రంగం
4) జ్ఞానాత్మక రంగం
- View Answer
- Answer: 4
5. ఒక విషయాన్ని గురించి లేదా వ్యక్తిని గురించి పరిమాణాత్మకంగా అంచనా కట్టడానికి విద్యాసంబంధమైన వాటిని గురించి మాత్రమే నిర్వహించేది?
1) మాపనం
2) మూల్యాంకనం
3) పరీక్ష
4) పైవన్నీ
- View Answer
- Answer: 3
6. మూల్యాంకనానికి ఒక ఆకారాన్ని ఒక అధికారాన్ని కల్పించి విద్యార్థి వర్తమాన ప్రగతిని అంచనా వేసేది?
1) పరీక్ష
2) మాపనం
3) మూల్యాంకనం
4) ఇవేవీకావు
- View Answer
- Answer: 2
7. నిరంతర ప్రక్రియ విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని తెలియజేస్తూ, భూత, భవిష్యత్, వర్తమాన ప్రగతిని అంచనా వేసేది?
1) పరీక్ష
2) మాపనం
3) మూల్యాంకనం
4) స్లిప్టెస్ట్
- View Answer
- Answer: 3
8. బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల సామర్థ్యాలను తెలుసు కోవడానికి ఉపయోగించే మూల్యాంకనం?
1) సంకలన మూల్యాంకనం
2) లోపనిర్ధారణ మూల్యాంకనం
3) నిర్మాణాత్మక, రూపణ మూల్యాంకనం
4) 1, 2
- View Answer
- Answer: 2
9. బోధన మధ్యలో విద్యార్థి అభ్యసనాన్ని అంచెలంచెలుగా తెలుసుకొని బోధనా పద్ధ తిలో మార్పులు చేసుకునేందుకు ఉపాధ్యా యుడు ఏ మూల్యాంకనం చేస్తాడు?
1) సంకలన
2) రూపణ, నిర్మాణాత్మక
3) సంకలన, రూపణ
4) లోపనిర్ధారణ
- View Answer
- Answer: 2
10. సంకలనాత్మక మూల్యాంకనం ఏ విధంగా జరుగుతుంది?
1) బోధనకు ముందు
2) బోధన మధ్యలో
3) బోధన పూర్తైన తర్వాత
4) బోధనకు ముందు, తర్వాత
- View Answer
- Answer: 3
11. వార్షిక పరీక్షలను ఏ మూల్యాంకనానికి సాధనాలుగా చెప్పొచ్చు?
1) నిర్మాణాత్మక
2) సంకలన
3) లోప నిర్ధారణ
4) పైవన్నీ
- View Answer
- Answer: 2
12. ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని అర్థం చేసు కున్న లక్ష్మీ అనే బాలిక ప్రవర్తనా సరళిని, అదే పాఠ్య విషయాలను అర్థం చేసుకున్న సీతలో ఆశించిన మార్పులకు చేపట్టాల్సిన అభ్యసనానుభవాలను నిర్ణయించే విధానం?
1) వైషమ్య విధానం
2) గుర్తింపు విధానం
3) పరీక్ష విధానం
4) విధానమేకానిది
- View Answer
- Answer: 1
13. ‘కణ విభజనలో క్షయకరణ విభజనకు సంబంధించిన దశలను వివరించండి?’పై ప్రశ్న ఏ రకమైన పరీక్షల్లో వస్తుంది?
1) పరిపృచ్ఛ
2) మౌఖిక పరీక్ష
3) లక్ష్యాత్మకపరీక్ష
4) వ్యాసరూప పరీక్ష
- View Answer
- Answer: 4
14. ఉపాధ్యాయుడి ఆత్మాశ్రయ భావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం వల్ల విద్యార్థికి ఏ పరీక్షల్లో న్యాయం జరగకపోవచ్చు?
1) లక్ష్యాత్మక పరీక్ష
2) అభిరుచి శోధిక
3) వ్యాసరూప పరీక్ష
4) సహజ సామర్థ్య పరీక్ష
- View Answer
- Answer: 3
15. ‘ఆవరణ వ్యవస్థలో వినియోగదారులు––– పై ఆధారపడే ఉంటాయి?’ ఇది ఏ రకమైన పరీక్షల్లో వస్తుంది.
1) వ్యాసరూప
2) లక్ష్యాత్మక
3) పరిపృచ్ఛ
4) సహజ సామర్థ్య
- View Answer
- Answer: 2
16. ఏ పరీక్షల్లో విశ్వసనీయత ఎక్కువ?
1) ప్రశ్నావళి
2) వ్యాసరూప
3) పరిపృచ్ఛ
4) లక్ష్యాత్మక
- View Answer
- Answer: 4
17. లక్ష్యాత్మక పరీక్షల్లో దేనికి అవకాశం లేదు?
1) మాస్ కాపీయింగ్
2) జ్ఞానం
3) ఉపాధ్యాయుడి ఆత్మాశ్రయత
4) విశ్వసనీయత
- View Answer
- Answer: 3
18. ముద్రణాయంత్రం కనిపెట్టక ముందు నుంచే ఏ పరీక్షలు ఉన్నాయి?
1) వ్యాసరూప
2) లక్ష్యాత్మక
3) ప్రశ్నావళి
4) మౌఖిక
- View Answer
- Answer: 4
19. డీఎస్సీ పరీక్షలు ఏ రకం పరీక్షలకు ఉదాహరణ?
1) లక్ష్యాత్మక
2) మౌఖిక
3) వ్యాసరూప
4) అభిరుచి శోధిక
- View Answer
- Answer: 1
20. విద్యార్థుల మానసిక ప్రవృత్తి, భావవ్యక్తీక రణ పరీక్షించడానికి తోడ్పడే పరీక్షలు?
1) వ్యాసరూప
2) లక్ష్యాత్మక
3) మౌఖిక
4) ప్రామాణీకరణం చేసిన పరీక్షలు
- View Answer
- Answer: 3
21. శిక్షణ సామర్థ్యం ఉన్న వ్యక్తులను ఆ సామర్థ్యం లేని వ్యక్తుల నుంచి వేరు చేయడానికి ఉపయోగపడేవి?
1) సమస్యా విధాన పరీక్షలు
2) సహజ సామర్థ్య పరీక్షలు
3) ప్రామాణీకరణ పరీక్షలు
4) లక్ష్యాత్మక పరీక్షలు
- View Answer
- Answer: 2
22. విద్యార్థికి జీవశాస్త్ర, ప్రయోగశాల్లో అమీబా నమూనాను చూపి గుర్తించమనడం ఏ పరీక్షకు ఉదాహరణ?
1) లక్ష్యాత్మక
2) సహజ సామర్థ్య
3) నిష్పాదన
4) ప్రామాణీకరణ
- View Answer
- Answer: 3
23. పరిస్థితిని బట్టి సందర్భానుసారంగా ప్రశ్న లను ప్రత్యక్షంగా అడగటం?
1) అనియత పరిపృచ్ఛ
2) నియత పరిపృచ్ఛ
3) సామూహిక పరిపృచ్ఛ
4) ప్రశ్నావళి
- View Answer
- Answer: 1
24. ఉపాఖ్యాన రికార్డు అని దేన్ని పిలుస్తారు?
1) అభిరుచి శోధిక
2) నియత పరిపృచ్ఛ
3) జీవిత సంఘటన పత్రావళి
4) ప్రశ్నావళి
- View Answer
- Answer: 3
25. ఒక విద్యార్థికి చెందిన నాయకత్వ లక్షణాలను అంచనా వేయడానికి ఉపకరించే సాధనం?
1) అభిరుచి శోధిక
2) చెక్లిస్ట్
3) జీవిత సంఘటన పత్రావళి
4) అంచనా మాపని
- View Answer
- Answer: 4
26. ఈ రకం పరీక్షల్లో ప్రశ్నకు ఎదురుగా అవును, కాదు అనేవి మాత్రమే ఉంటాయి. ఇది మూర్తిమత్వ పరీక్ష?
1) లక్ష్యాత్మక
2) వ్యాసరూప
3) చెక్లిస్ట్
4) అభిరుచి శోధిక
- View Answer
- Answer: 3
27. విద్యార్థి గురించిన పూర్తి చిత్రం సంవత్సరం వారీగా అతని వికాసం తెలుసుకునేది?
1) జీవిత సంఘటన పత్రావళి
2) అభిరుచి శోధిక
3) చెక్లిస్ట్
4) క్రమాభివృద్ధి, సంచిత పత్రావళి
- View Answer
- Answer: 4
28. తారాదేవి రిపోర్ట్ పరీక్షల సంస్కరణల్లో సూచించిన ప్రకారం, ప్రశ్నపత్రంలో లక్ష్యా త్మక ప్రశ్నలకు ఇవ్వాల్సిన సమయం?
1) 1 గంట
2) 2 బీ గంటలు
3) బీ గంట
4) 3 గంటలు
- View Answer
- Answer: 3
29. ఎవరైతే బోధిస్తారో వారే పరీక్షించడం ఆవశ్యకం అని వివరించిన వారు?
1) తారాదేవి రిపోర్ట్
2) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
3) కొఠారి కమిషన్
4) మొదలియార్ కమిషన్
- View Answer
- Answer: 2
30. విద్యార్థుల ఫలితాలను చూపే యోగ్యతా పత్రాలు వేర్వేరు సబ్జెక్టుల్లో విద్యార్థుల నిష్పాదనాన్ని తెలిపేవిగా ఉండాలి – కానీ మొత్తం పరీక్షలో పాస్, ఫెయిల్ అని నిర్ణ యించేవిగా ఉండొద్దు అని సూచించింది?
1) కొఠారి కమిషన్
2) తారాదేవి రిపోర్ట్
3) యూజీసీ
4) మొదలియార్ కమిషన్
- View Answer
- Answer: 1
31. ఉత్తమ నికషకు ఉండాల్సిన లక్షణం కానిది?
1) సప్రమాణత
2) లక్ష్యాత్మకత
3) ఆచరణాత్మకత
4) ఆత్మాశ్రయత
- View Answer
- Answer: 4
32. లక్ష్యాత్మక అంటే ఒక పరీక్ష పత్రాన్ని వేర్వేరు ఉపాధ్యాయులు దిద్దినప్పుడు?
1) వేర్వేరు మార్కులు రావాలి
2) ఒకే మార్కులు రావాలి
3) మొదటి ఉపాధ్యాయుడి మార్కులు పరిగణించాలి.
4)చివర దిద్దిన ఉపాధ్యాయుడి మార్కులు పరిగణించాలి
- View Answer
- Answer: 2
33. కింది వాటిలో ఏ పరీక్షలకు విశ్వసనీయత తక్కువగా ఉంటుంది?
1) నిష్పాదన పరీక్షలు
2) లక్ష్యాత్మక పరీక్షలు
3) వ్యాసరూప పరీక్షలు
4) పైవన్నీ
- View Answer
- Answer: 3
34. అన్నిపాఠ్యాంశాల్లోని అన్ని విషయాలను పరీక్షించేటట్లు పరీక్షా పత్రం ఇస్తే దానికి ఏ లక్షణం ఉందని అంటారు?
1) ఆచరణాత్మకత
2) విశ్వసనీయత
3) లక్ష్యాత్మకత
4) సమగ్రత
- View Answer
- Answer: 4
35. పాఠ్య విభాగాన్ని బోధించిన తర్వాత రూపొందించుకున్న బోధనా లక్ష్యాలు నెరవేరింది?
1) వార్షిక పరీక్ష
2) త్రైమాసిక పరీక్ష
3) యూనిట్ పరీక్ష
4) అర్ధసంవత్సర పరీక్ష
- View Answer
- Answer: 3
36. యూనిట్ పరీక్షలో నైపుణ్యానికి ఇచ్చే మార్కుల శాతం?
1) 24
2) 32
3) 12
4) 18
- View Answer
- Answer: 3
37. యూనిట్ పరీక్షలో కఠిన స్థాయి ప్రశ్నలకు ఇచ్చే మార్కుల శాతం?
1) 24
2) 53
3) 14
4) 100
- View Answer
- Answer: 1
38. యూనిట్ పరీక్షలో ప్రశ్నపత్రం రూపకల్పనలో కింది వాటిలో దేనికి ఎక్కువ మార్కులు కేటాయించాలి?
1) కఠిన స్థాయి
2) సాధారణ స్థాయి
3) తేలిక స్థాయి
4) అన్నింటికీ సమానంగా
- View Answer
- Answer: 2
39. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్లో ప్రశ్నపత్రం సప్రమాణత రూపోందించడానికి తోడ్పడేది?
1) అమోనియా ప్రింట్
2) న్యూస్ ప్రింట్
3) జిరాక్స్ ప్రింట్
4) బ్లూ ప్రింట్
- View Answer
- Answer: 4
40. బ్లూ ప్రింట్ తయారీలో దేనికి ప్రాముఖ్యత ఉండదు?
1) లక్ష్యాలు
2) ఉపప్రమాణం
3) ఉపాధ్యాయుల అభిరుచి
4) పరీక్షాంశ రకం
- View Answer
- Answer: 3