APPSC Group 2 Application Date Extended 2024 : గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌-2 ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే.. ప‌రీక్ష తేదీ మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌-2 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రూప్‌-2 సర్వీస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ గడువు తేదీని పొడిగించినట్లు ఏపీపీఎస్సీ జ‌న‌వ‌రి 10వ తేదీన (బుధ‌వారం) ఓ ప్రకటనలో తెలిపంది.

గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు గడువు జనవరి 10వ తేదీన‌ ముగియనున్న విష‌యం తెల్సిందే. అయితే తాజా ప్రకటనతో దరఖాస్తు గడువు జనవరి 17వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగించింది. 
ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ముగింపు గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. 

చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్‌–2పై గురిపెట్టండిలా!

ఆంధ్రప్రదేశ్‌‌లో 899 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ(APPSC) డిసెంబరు 7న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో గ్రూప్‌ 2 పోస్టులకు డిసెంబర్‌ 21 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 10వ తేదీతో తుది గడువు ముగియనుంది. అయితే దరఖాస్తుదారులకు సర్వర్‌ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ త‌ర్వాత ఉచితంగా

కొన్ని సార్లు వెబ్‌సైట్‌ అసలు తెరుచుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. మరికొన్ని సార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన తర్వాత.. పేమెంట్‌ విషయంలో ఎర్రర్‌ మెసేజ్‌ వస్తోందని అంటున్నారు. దీంతో వివరాల నమోదు ప్రక్రియ మళ్లీ మొదటికొస్తోందని వాపోతున్నారు. ఏకకాలంలో అధిక మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తుండడంతో సర్వర్‌ జామ్‌ అవుతోంది. దీంతో గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో వారు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు చేశారు. దీనిపై స్పందించిన కమిషన్‌ తాజాగా దరఖాస్తు గడువును జనవరి 17వ తేదీ ఆర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది.

➤☛ UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

గ్రూప్-2 పోస్టులకు సంబంధించి మొత్తం 899 ఖాళీల్లో.. 53 క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులకాగా, 846 తాజా ఖాళీలు ఉన్నాయి. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్, 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల నుంచి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు గడువు జనవరి 10తో ముగియాల్సి ఉండగా.. జవనరి 17 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 

ప‌రీక్ష తేదీ ఇదే..

గ్రూప్-2 పోస్టుల భర్తీని ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ఆధారంగా భర్తీచేయనున్నారు. అభ్యర్థులకు ఫిబ్రవరి 25న స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమినరీ పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఏపీపీఎస్సీ నిర్ణయించిన నిష్పత్తి ఆధారంగా మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ రాత పరీక్షలో కనబరచిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష(CPT) నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్ష రెండూ ఆఫ్‌లైన్ మోడ్(ఓఎంఆర్) ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతాయి. కొత్త సిలబస్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. 

#Tags