Skip to main content

APPSC Group 2 Prelims Exam 2024 Selection Ratio 1:100 : గ్రూప్‌-2 ప్రిలిమ్స్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఎంపిక నిష్పత్తి 1:100.. ఈ వ‌చ్చే వారంలోనే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (APPSC) గ్రూప్‌-2 ప్రిలిమ్స్ అభ్య‌ర్థుల‌కు వ‌చ్చే వారంలో గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న‌ది. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ పేప‌ర్ కొద్దిగా క‌ష్టంగా వ‌చ్చింద‌ని చాలా అభ్య‌ర్థులు అంటున్నారు.
Exciting News Expected for Group-2 Prelims Candidates   Candidates Anticipating Good News Regarding Group-2 Prelims Exam Results   APPSC Group 2 Prelims Exam 2024 Cut Off Marks    Andhra Pradesh Public Service Commission Group-2 Prelims Exam Announcement

Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఉంటుంద‌ని ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబ‌ర్ Parige Sudhir గారు ఎక్స్ వేదిక‌గా తెలిపారు. వ‌చ్చే వారంలోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలిపారు. దీంతో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ అభ్య‌ర్థుల‌కు ఉపసయనం ల‌భించ‌నున్న‌ది. APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఇస్తే .. Cut Off  Marks భారీగా త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. దీంతో చాలా మంది అభ్య‌ర్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవ‌కాశం ఉంది. అలాగే గ్రూప్‌-2 అభ్య‌ర్థులు సంతోషంగా గ్రూప్‌-2 మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వ‌వ‌చ్చును.

చాలా రోజుల నుంచి APPSC Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్ప‌త్తి 1:100 ఇస్తే మంచిద‌ని.. గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు కోరుతున్న విష‌యం తెల్సిందే. అయితే అభ్య‌ర్థులు విన్నపాలు మేర‌కు ఈ Cut Off పై ఏపీపీఎస్సీ వ‌ర్గాలు సానుకులంగా ఉన్నారు. 

☛☛ APPSC Group-1 Prelims Paper-1 Answer Key 2024 : ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-1 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

☛☛ APPSC Group-1 Prelims Answer Key 2024 : ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 కోశ్చన్‌ పేపర్‌ & కీ.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!

ఫ‌లితాల విడుద‌ల‌..?
గ్రూప్‌-2 ప్రిలిమ్స్ 2024 పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ ఫలితాలను 4 నుంచి 5 వారాల్లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Group -2 మెయిన్‌ ఇలా..: 
APPSC Group-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌–1లో సెక్షన్‌–1: సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్‌–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్‌–2లో సెక్షన్‌–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్‌–2 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.

 

Published date : 18 Mar 2024 10:20AM

Photo Stories