TSPSC Group 1 Prelims: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ కటాఫ్ ఇంతే..! ఎందుకంటే..?

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది.
tspsc group 1 prelims cut off

జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్‌ పరీక్షలకు అవకాశం ఉంటుంది.

TSPSC తెలంగాణ చరిత్ర ఆన్‌లైన్ పరీక్షలు; 19 టాపిక్స్ నుండి 1200+ ప్రశ్నలు

ఈ సారి ఒకోక్క పోస్టుకు..
ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 503 గ్రూప్‌–1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఎక్కువ మార్కులు సాధించిన వారికే మెయిన్స్‌కు అవకాశం దక్కనుండగా.. ఈ ఎంపిక విధానంలోనూ టీఎస్‌పీఎస్సీ మల్టీజోన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, జెండర్, ఈడబ్ల్యూఎస్, డిజేబుల్, స్పోర్ట్స్‌ కేటగిరీలో మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

గ్రూప్‌–1 కటాఫ్‌ మార్కులు ఒక్కో జోన్‌లో..


ఇప్పటివరకు గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో జనరల్‌ మెరిట్‌ ప్రకారం ఎంపిక జరిగేది. దీంతో కటాఫ్‌ మార్కులు ఒక సంఖ్య దగ్గర ఆగిపోయేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో తెచ్చిన నూతన జోనల్‌ విధానంతో ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రూప్‌–1 కటాఫ్‌ మార్కులు ఒక్కో జోన్‌లో, ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉండగా.. ఒక్కో మల్టీజోన్‌లో కటాఫ్‌ మార్కులు ఒక్కోలా ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్లు, జెండర్‌ ప్రకారం కటాఫ్‌ మార్కులు మరోవిధంగా ఉంటాయి. 

TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

ప్రిలిమ్స్‌ మార్కులను కేవలం..
పోటీ ఎక్కువగా ఉండటం, కటాఫ్‌ నిర్ధారణలోనూ జోన్ల వారీగా వేర్వేరుగా ఉండటంతో అభ్యర్థులు మరింత కఠిన సాధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రిలిమ్స్‌ మార్కులను కేవలం మెయిన్‌ పరీక్షల ఎంపిక వరకే పరిగణిస్తామని, తుది ర్యాంకింగ్‌లో వీటిని పరిగణించబోమని టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది.

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

కటాఫ్‌ ఇలా...
అభ్యర్థుల స్థానికత ఆధారంగా మల్టీజోన్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో గ్రూప్‌–1 మెయిన్స్‌కు ఎంపిక రెండు మల్టీజోన్ల ఆధారంగా చేపడతారు. ఆ తర్వాత రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు, డిజేబుల్, స్పోర్ట్స్‌ రిజర్వేషన్లను అమలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతో కటాఫ్‌ మార్కులు ఒక్కో జోన్‌లో ఒక్కో రకంగా ఉంటాయి. ఉదాహరణకు మల్టీజోన్‌–1లోని బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు.. మల్టీజోన్‌–2లో బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు ఒకేరకంగా ఉండవు. ఇదే తరహాలో మిగిలిన కేటగిరీల్లో ఒక్కో జోన్‌లో కటాఫ్‌ మార్కులు ఒక్కోవిధంగా ఉండనున్నాయి.

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మొత్తం దరఖాస్తులు 3,80,202.. ఒక్క పోస్టుకు ఎంత‌మందంటే..?
రాష్ట్ర సివిల్ సర్వీసెస్ చెప్పుకునే గ్రూప్‌–1 కొలువుకు పోటీ విపరీతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా చేపడుతున్న గ్రూప్‌–1 ఉద్యోగాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగానే కుస్తీ పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్‌–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏప్రిల్‌ నెలాఖరులో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్‌ 4 నాటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌

డిసెంబర్‌లో మెయిన్‌ పరీక్షలు..
ఇందులో పురుషులు 2,28,951, మహిళలు 1,51,192, ట్రాన్స్‌జెండర్లు 59 ఉన్నారు. ఇక డిజేబుల్‌ కేటగిరీలో 6,105, ప్రభుత్వ ఉద్యోగులు 51,553 మంది ఉన్నారు. ఈక్రమంలో ఒక్కో ఉద్యోగానికి సగటున 756 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు నెలలో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు, డిసెంబర్‌లో మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన 312 గ్రూప్‌–1 ఉద్యోగాలకు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

పోటీ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తులు ఈ విధంగా..

గ్రాడ్యుయేట్లు 2,53,490
పోస్టుగ్రాడ్యుయేట్లు      1,22,826
ఇంటిగ్రేటెడ్‌(డిగ్రీ+పీజీ) 1,781
ఎంఫిల్‌ 424 
పీహెచ్‌డీ 1,681

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ ప్రీవియ‌స్‌పేప‌ర్స్‌ కోసం క్లిక్ చేయండి

తెలంగాణ‌లో శాఖల వారీగా గ్రూప్‌-1 పోస్టుల వివరాలు.. వ‌యోప‌రిమితి ఇలా .. : 

పోస్టు ఖాళీలు వయో పరిమితి
డిప్యూటీ కలెక్టర్‌ 42 18–44
డీఎస్పీ 91 21–31
కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌ 48 18–44
రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ 4 21–31
జిల్లా పంచాయతీ అధికారి 5 18–44
జిల్లా రిజి్రస్టార్‌ 5 18–44
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌(మెన్‌) 2 21–31
అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ 8 18–44
అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 26 21–31
మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–2) 41 18–44
అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సాంఘిక సంక్షేమం) 3 18–44
డీబీసీడబ్ల్యూఓ (బీసీ సంక్షేమం) 5 18–44
డీటీడబ్ల్యూఓ (గిరిజన సంక్షేమం) 2 18–44
జిల్లా ఉపాధి కల్పనాధికారి 2 18–44
పరిపాలనాధికారి(ఏఓ)(వైద్య, ఆరోగ్య శాఖ) 20 18–44
అసిస్టెంట్‌ ట్రెజరర్‌(ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌) 38 18–44
అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌(స్టేట్‌ ఆడిట్‌ సరీ్వస్‌) 40 18–44
ఎంపీడీఓ(పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి) 121 18–44

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

సబ్జెక్ట్‌ సమయం (గంటలు) గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ) 2 1/2 150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష) 3 150

మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3 150
పేపర్‌–2 హిస్టరీకల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      
  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3 150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌  
  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3 150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌            
  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     
  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3 150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 
  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3 150

TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..? 

#Tags