APPSC Group 1 Application Extended 2024 : గుడ్‌న్యూస్.. గ్రూప్–1 దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే..
అలాగే కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి.ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఈ గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సివిల్), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్(పురుషులు), డివిజినల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి, కో–ఆపరేటివ్ సర్వీస్ డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–1), అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ తదితర ఉన్నతస్థాయి పోస్టులు ఉన్నాయి.
ఎంపిక విధానం :
అభ్యర్థులను.. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 (జనరల్ స్టడీస్ 120 ప్రశ్నలు–120 మార్కులు); పేపర్–2 (జనరల్ ఆప్టిట్యూడ్ 120 ప్రశ్నలు–120 మార్కులు).
మెయిన్ ఎగ్జామినేషన్ :
గ్రూప్-1 మెయిన్‌లో అయిదు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్‌కు 150 మార్కులు చొప్పున 750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవి.. పేపర్–1 జనరల్ ఎస్సే; పేపర్–2–ఏపీ, భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం; పేపర్–3–పాలిటీ, రాజ్యాంగం, పాలన, లా,ఎథిక్స్; పేపర్–4 ఎకానమీ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి; పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు. మెయిన్ ఎగ్జామినేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా.. చివరగా 75 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.