Delhi Bomb Blast: ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద ఘోర ప్రమాదం
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు నివాసులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ తోపాటు, నేర బృందాన్ని, ఫారెన్సిక్ బృందాన్ని కూడా ఘటనాస్థలానికి చేర్చారు. అక్కడి పరిస్థితిని చూసి సిబ్బందులంతా పరిశీలించి.. ఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు గాని, ఎవరిపైన కూడా అనుమానం కాని లేవని మీడియాకు తెలిపారు. ఈ ఘటనా స్థలంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Covid-19: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. దేశంలో ఎంత మంది మరణించారంటే..!
ఇజ్రాయెల్ ఎంబసీ అధికార ప్రతినిధి ఈ సంఘటన గురించి మాట్లాడుతూ... అక్కడ జరిగిన బ‍్లాస్ట్‌లో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, అందరూ క్షేమంగానే బయట పడ్డారని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని తెలిపారు. ప్రస్తుతం, విచారణ ప్రారంభించారని తెలిపారు.