Skip to main content

Covid-19: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. దేశంలో ఎంత మంది మరణించారంటే..!

కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది.
India Logs 656 New Covid-19 Infections    Health Department Reports  Latest COVID-19 Stats

గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ డిసెంబ‌ర్ 24(ఆదివారం)న‌ వెల్లడించింది.

కేరళలో మరో వ్యక్తి కోవిడ్‌తో కన్ను మూయడంతో దేశంలో ఇప్పటి దాకా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్‌లో తొలి కేసు వెలుగుచూసిన నాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ పూర్తయింది.  

ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త
శ్వాస సంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్‌ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. 
‘పండుగల సీజన్‌ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’ అని ఆమె చెప్పారు. జేఎన్‌1 ఉపవేరియంట్‌కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్‌ వ్యాక్సిన్లు జేఎన్‌1 సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్‌ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కల్పిస్తాయి అని ఆమె చెప్పారు.  ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్‌ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది.

Covid Subvariant JN.1: కరోనా కొత్త వేరియంట్‌ కలకలం.. దేశంలో మొద‌టి కేసు ఎక్క‌డ‌ నమోదయ్యిందంటే..!

Published date : 26 Dec 2023 08:14AM

Photo Stories