TS ICET 2024 Notification: టీఎస్‌ ఐసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్‌సీహెచ్‌ఈ).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ఐసెట్‌)–2024 నోటిఫికేషన్‌ విడుదలచేసింది. పరీక్షను వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ(కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలో కింది పేర్కొన్న యూనివర్శిటీలలో ప్రవేశాలు పొందవచ్చు.

అర్హత: ఎంబీఏకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంసీఏకు కనీసం 50శాతం మార్కులతో ఇంటర్‌/డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్‌ సబ్జెక్ట్‌తో బీసీఏ/బీఎస్సీ/బీకాం/బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.04.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 17.05.2024 నుంచి 20.05.2024 వరకు
పరీక్ష తేదీలు: 2024 జూన్‌ 4, 5 తేదీల్లో

వెబ్‌సైట్‌: https://icet.tsche.ac.in/

చదవండి: TS EdCET 2024: టీఎస్‌ ఎడ్‌సెట్‌–2024 నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇలా..

#Tags