Skip to main content

ANU Engineering Entrance Test 2024: బీటెక్‌+ఎంటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. పరీక్ష విధానం ఇదే..

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎన్‌యూ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీలో సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో బీటెక్‌+ఎంటెక్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Dr YSR ANU College of Engineering and Technology Building   ANU Engineering Entrance Test 2024  Dr YSR ANU College of Engineering and Technology Building

కోర్సు వివరాలు: బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌.
మొత్తం సీట్ల సంఖ్య: 510.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్, సైబర్‌ సెక్యూరిటీ.
అర్హత: కనీసం 45శాతం మార్కులతో మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, కౌన్సిలింగ్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్‌(40 ప్రశ్నలు), ఫిజిక్స్‌(30 ప్రశ్నలు),కెమిస్ట్రీ(30 ప్రశ్నలు)సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.ఇంగ్లిష్‌ మా«ధ్యమంలో పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.03.2024
ఆలస్య రుసుము రూ.750తో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.03.2024.
ఆలస్య రుసుము రూ.1250తో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.03.2024.
హాల్‌టికెట్‌  డౌన్‌లోడ్‌ తేది: 01.04.2024
ప్రవేశ పరీక్షతేది: 07.04.2024.
ఫలితాల వెల్లడి తేది: 10.04.2024.

వెబ్‌సైట్‌: https://www.anucet.in/

చదవండి: Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!

Published date : 13 Feb 2024 09:43AM

Photo Stories