Skip to main content

AP LAWCET/PGLCET 2024 Notification: ఏపీ లాసెట్‌/పీజీ ఎల్‌సెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఏపీ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీ లాసెట్‌)/పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లాసెట్‌(ఏపీ పీజీఎల్‌సెట్‌)–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పరీక్షను గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నిర్వహిస్తుంది.
AP Law Common Entrance Test  2024 Notification  AP LAWCET and PGLCET 2024 Notification   Eligible Candidates Invited for LLB and LLM ML Courses Admission

కోర్సులు: మూడేళ్ల/ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ(ఏపీ లాసెట్‌), ఎల్‌ఎల్‌ఎం(ఏపీ పీజీ లాసెట్‌).
అర్హత: కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష విధానం: ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ కోర్సులకు పరీక్ష ఇంగ్లిష్, తెలుగు రెండు మాధ్యమాల్లో ఉంటుంది. ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 25.04.2024.
హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 03.06.2024
ఏపీ లాసెట్‌/ఏపీ పీజీ లాసెట్‌ ప్రవేశ పరీక్షతేది: 09.06.2024.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

చదవండి: AU Engineering Entrance Test: ఏయూ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 నోటిఫికేషన్ విడుదల.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

Published date : 02 Apr 2024 01:05PM

Photo Stories