Electric Rickshaws: ప‌ర్యావ‌ర‌ణానికి అనుకూలంగా ఎల‌క్ట్రిక్ రిక్షాలు

కాలుష్య కార‌ణంగా ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెక్కుతున్నాయి. ఈ కార‌ణంగానే కొంత‌కాలం ముందు ఎలెక్ట్రిక్ బైకుల‌ను ప్రార‌భించారు. అవి ఇప్పుడు ఎంతో శాతం కొనుగోలు అయ్యాయి. అలాగే, ఇప్పుడు ఎల‌క్ట్రిక్ రిక్షాల‌ను కూడా ప్రారంభించామ‌ని ప్ర‌క‌టించారు. పూర్తి వివ‌రాలు..
Started e-Autos by waving green flags

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) భువనేశ్వర్‌ క్యాంపస్‌లో ఎలక్ట్రిక్‌ రిక్షా సేవలను మంగళవారం ప్రారంభించారు. సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ శ్రీపాద్‌ కర్మాల్కర్‌ ఈ సేవలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. నిరంతర పర్యావరణ అనుకూల రవాణాకు తన నిబద్ధతను ధ్రువీకరించడంలో భాగంగా ఈ సేవలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

Tribal Student Achievement: గిరిజ‌న విద్యార్థికి ఎస్ఐ పోస్టు

ఈ సేవల ప్రారంభోత్సవంలో రిజిస్ట్రార్‌ వామదేవ్‌ ఆచార్య, ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ (రవాణా) డాక్టర్‌ సచ్చిదానంద రథ్‌, స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ సైన్సెస్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.రామ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ప్రైవేటు టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థతో ఐఐటీ భువనేశ్వర్‌ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని ఈ–రిక్షా సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంతో పాటు మిషన్‌ లైఫ్‌ ప్రచారంలో భాగంగా జీరో ఎమిషన్‌ క్యాంపస్‌ నినాద కార్యక్రమంలో ఇదో ముందడుగు అని పేర్కొన్నారు.

#Tags