Skip to main content

Tribal Student Achievement: గిరిజ‌న విద్యార్థికి ఎస్ఐ పోస్టు

త‌ల్లిదండ్రుల‌ను గ‌ర్వించే స్థాయికి ఎదిగి ఎస్ఐ ప‌రీక్ష‌ల్లో విజ‌యం పొంది, ఉద్యోగం సాధించాడు, ఈ గిరిజ‌న విద్యార్థి. త‌న కుమారుని విజ‌యానికి స్పందిస్తూ త‌మ ఆనందాన్ని తెలిపారు.
SI post achiever tribal student Ganesh Nayak
SI post achiever tribal student Ganesh Nayak

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన ఎస్సై ఫలితాల్లో డిండి మండలం డాక్య తండ పేద కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థి వడిత్య హరి చందు, నాజుల కుమారుడు గణేష్ నాయక్ విజయం సాధించాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ తమ కుమారుడు ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివించారు.

Civils Ranker Success Journey: త‌ల్లి ఆశయం కొడుకు విజ‌యం

తాము కూలి పని చేసిన తమ కుమారుడు మంచి ఉద్యోగం సాధించాలని చదివించామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గణేష్ ఎస్సై ఉద్యోగం సాధించడంతో తండావాసులు ఆనందం వ్యక్తం చేశారు. వీరి కుటుంబం నుండి వడిత్య దీప్లా కుమారుడు ప్రదీప్ కుమార్ ఎస్ఐగా ఉద్యోగం చేస్తూ గత నెల సీఐగా ప్రమోషన్ పొందారు.

Published date : 27 Sep 2023 12:08PM

Photo Stories