Civils Ranker Success Journey: తల్లి ఆశయం కొడుకు విజయం
బాల్యం నుంచి ఆటలంటే మక్కువ.. తల్లికి మాత్రం తన కుమారుడు ఐఏఎస్ సాధించాలనే కోరిక.. ఇందుకు గాను తన అమ్మ మాటే సివిల్ సాధన మార్గంగా ఎంచుకుని రెండేళ్ల పాటు శ్రమించి సివిల్స్‌లో ఆలిండియా గొప్ప ర్యాంకుతో విజయం సాధించారు.
Success as Businessman: చదువులో ఫేయిల్ అయినా దేశంలోనే గొప్ప వ్యాపారవేత్త.. ఎలా?
ఈ కుమారుడు ఖమ్మం జిల్లాకు చెందిన మనుచౌదరి. ఆయన మూడేళ్లు నాగర్‌కర్నూల్‌లో అదనపు పాలనాధికారిగా (స్థానిక సంస్థలు) సేవలందించి ఇటీవలే బదిలీపై జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన పొందిన విజయం వెనుక ఉన్న కృషి, చదువు ప్రయాణం వంటి వివరాలను తన మాటల్లోనే తెలుసుకుందాం..
ఎంబీఏ చేస్తూనే సివిల్స్ కోసం ప్రిపరేషన్..
మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తవ్వగానే సివిల్స్ సాధించాలనే సంకల్పంతో ఢిల్లీలో ఎంబీఏలో చేరి ప్రిపరేషన్ ప్రారంభించా. శుభకార్యాలతో పాటు ఇతర వేడుకలకు దూరంగా ఉండి రెండేళ్ల పాటు రోజుకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు పుస్తకాలే లోకంగా చదివా. ఇందులో భాగంగానే పేపర్ల ద్వారా ఇతర విషయాలను తెలుసుకున్నా. ఇలా, మొదటి ప్రయత్నంలో సివిల్స్ ర్యాంకు సాధించా.
ఇష్టమైన రంగాలే ఎంచుకోవాలి
విద్యార్థులకు ఇష్టమైన రంగాలనే ఎంచుకునేందుకు తల్లిదండ్రులు అవకాశం కల్పించాలి. తమ కోరికలను పిల్లలపై రుద్దవద్దు. నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆటలతో పాటు చదువుకు సమప్రాధాన్యం ఇచ్చేవాడిని. నా తల్లిదండ్రులు నాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునేందుకు ప్రోత్సాహించారు. ఇంజినీరింగ్‌లో మెకానికల్ బ్రాంచ్‌ను ఎంచుకున్నా. తదనంతరం ఎంబీఏ కోర్సులో చేరా.
Successors in Achieving Goals: పేద కుటుంబాల్నించి వచ్చి గొప్ప విజయాన్ని సాధించారు ఈ యువకులు
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే ప్రామాణికం
సివిల్స్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుని చదివా. శిక్షణ, చదువు సమయం పోను రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయేందుకు వెచ్చించేవాడిని. చరవాణిని విద్యాసంబంధ విషయాలకు మాత్రమే వినియోగించా. వాట్సప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నా. లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడంతోనే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించగలిగా.
ఏ మాధ్యమంలోనైన విద్యను పొందవచ్చు
ఆంగ్లమాధ్యమం చదివితేనే సివిల్స్ సాధించడం తేలిక అనేది అపోహ మాత్రమే. మా బ్యాచ్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ తెలుగు మాధ్యమంలోనే విద్యనభ్యసించడంతో పాటు సివిల్స్ మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూ తెలుగులోనే పూర్తిచేసి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఆయన గెలుపుతో లక్ష్యసాధనకు మాధ్యమం అడ్డంకి కాదని నిరూపితమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని ప్రణాళిక ప్రకారం శ్రమిస్తే విజయం సాధించడం తేలిక.
Success in Govt Job: ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన యువకుడు
నిరంతర సాధనతో విజయం పొందగలం..
పలువురు విద్యార్థులు సివిల్స్ సాధించాలనే తపనతో కోచింగ్ తీసుకుంటున్నారు. సమయం చిక్కినప్పుడు మాత్రమే చదువుతున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఈ విధానంతో సివిల్స్ కొట్టడం కష్టం. నిరంతర అభ్యసంతో పాటు ప్రణాళిక ప్రకారం చదివితేనే పోటీ పరీక్షల్లో నెగ్గుతాం.
దినపత్రికలు ముఖ్య సాధన..
రోజు తప్పనిసరిగా ఈనాడు, హిందూ దినపత్రికలు చదివేవాడిని. వీటి పఠనంతోనే సామాజిక అంశాలతో పాటు సమకాలీన అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగింది. ప్రస్తుతం విద్యార్థులు, యువత దినపత్రికలు చదవడం తగ్గించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో విషయ పరిజ్ఞానం తగ్గుతుందే తప్ప.. మెరుగుపడడం కష్టం.
TS Intermediate: ఇంటర్ విద్యార్థులకు చైర్మన్ చెప్పిన కీలక అంశాలు
ఐఏఎస్ అధికారి చిత్రారామచంద్రన్ స్ఫూర్తితో...
మా అమ్మ భారతి చదువుకునే సమయంలో అప్పుడు కలెక్టర్‌గా ఉన్న చిత్రారామచంద్రన్ పనితీరును చూసి ఐఏఎస్ అధికారి అయితే పేదలకు సేవలు అందించవచ్చని భావించారు. నా పాఠశాల విద్య పూర్తయిన నాటినుంచే ఐఏఎస్ అధికారి అయితే ప్రజల జీవితాల్లో నూతన సంస్కరణలు తీసుకురావచ్చని నూరిపోశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పిదప సివిల్స్ కోచింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల జీవితాల్లో ఇంటర్ కీలకం. ఈ సమయంలో లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కోర్సులు ఎంచుకోవాలి. ప్రస్తుతం చదువుకునేందుకు ఉన్నటువంటి విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత ముందుకు సాగాలి. సాధించాలనే తపన ఉంటే ఏదీ అడ్డుకాదని అమ్మ చెప్పేవారు.