Success in Govt Job: ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన యువకుడు
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని ఎంచుకుని కృషి చేస్తే విజయం సొంతమవుతుందని చెబుతున్నారు ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికైన మధిర వాసి కొర్రపాటి రవికిరణ్. మధిరకు చెందిన కె.సునీత – యోహాన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగా, వీరి చిన్న కుమారుడు రవికిరణ్ మొట్టమొదటి పోటీపరీక్షల్లోనే ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయన తల్లిదండ్రులతోపాటు బంధువుల్లో పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుండడంతో తాను కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బీటెక్ అయ్యాక ఉద్యోగాకాశాలు వచ్చినా చేరలేదు.
Successful Dream: కలను నెరవేర్చుకున్న యువకులు
ఆయన స్నేహితుడు పోలీస్ ఉద్యోగానికి సిద్దమవుతుండడంతో రవికిరణ్ కూడా 2020 నుంచి సాధన మొదలుపెట్టారు. తొలుత హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్‌లో చేరినా కోవిడ్ కారణంగా ఇంటికొచ్చి ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నాడు. మళ్లీ పరిస్థితులు చక్కబడ్డాక హైదరాబాద్ వెళ్లి ఎస్సై పరీక్షకు సిద్ధమైన ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి సునీత, మేనమామ కిరణ్‌కుమార్ ప్రోత్సాహం.. బంధువులు, స్నేహితుల సహకారం మరువలేనిదని చెప్పారు.