Successful Dream: కలను నెరవేర్చుకున్న యువకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా దుండ్రపల్లికి చెందిన గుంటి అరుణ్ కుమార్‌కు చిన్ననాటి నుంచి పోలీస్ యూనిఫాం వేసుకోవాలనేది కల. వీరిది వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్నలు అంజవ్వ– ఎల్లయ్య. బీటెక్ కొండగట్టు జేఎన్‌టీయూలో, ఎంటెక్ ఉస్మానియాలో పూర్తి చేశాడు. మిత్రులందరూ సాఫ్ట్‌వేర్ వైపు వెళ్తే.. అరుణ్ మాత్రం పట్టు వదలకుండా కరీంనగర్‌లో కోచింగ్ తీసుకున్నాడు. రెగ్యులర్‌గా ఈవెంట్స్, థియరీ ప్రిపేర్ అవుతూ సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు.
నెరవేరిన లక్ష్యం
జగిత్యాల జిల్లా తాటిపల్లికి చెందిన బాదినేని రాజేశ్వర్‌ది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న గంగు– గంగారెడ్డి. 2014లో డిగ్రీ పూర్తిచేశాడు. అప్పటి నుంచి పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2016లో టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. 2018లో అర్చనతో వివాహమైంది. నాలుగేళ్ల కూతురు అన్షిత ఉంది. అయినా ప్రిపరేషన్ ఆపకుండా ఎస్సై కొలువే లక్ష్యంగా ముందుకు సాగాడు. కరీంనగర్‌లో ఉంటూ.. ఓ ప్రయివేటు సంస్థలో శిక్షణ పొందాడు. ఆదివారం నాటి ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో విజయం సాధించాడు. రాజన్న సిరిసిల్ల జోన్‌లో సివిల్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఇన్నేళ్ల తన కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని జగదీశ్వర్ వివరించాడు.
చొప్పదండి మండలానికి చెందిన ముగ్గురు పేదింటి యువత ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. గుమ్లాపూర్‌కు చెందిన రైతు
అంజయ్య, కవితల ఏకై క కుమారుడు పొరండ్ల అనిల్‌కుమార్ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.
రుక్మాపూర్‌కు చెందిన కూలీ కుటుంబం నుండి కుంచం మానస ఎస్‌ఐగా ఎంపికైంది.
గుమ్లాపూర్‌కు చెందిన బత్తుల నారాయణ కుమారుడు బత్తుల అభిలాష్ ఆర్‌ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.