TS Intermediate: ఇంటర్ విద్యార్థులకు చైర్మన్ చెప్పిన కీలక అంశాలు
Sakshi Education
కళాశాలలో జరిగే సదస్సులో భాగంగా చదువు వ్యక్తికి ఎంత ముఖ్యం, దాని వలన మనం అందుకునే శిఖరం ఎటువంటిదో చేబుతూ ప్రోత్సహించారు.
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి సూచించారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శనివారం ఇన్‌స్పైర్ – ఇగ్నైట్ ఆధ్వర్యాన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి సారిస్తే మంచి ఫలితాలు వస్తాయని, తద్వారా తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు.
అనంతరం డైరెక్టర్ సంతోష్‌రెడ్డి, సీఈఓ సురేందర్‌రెడ్డి, జోనల్ ఇన్‌చార్జ్ విజయభాస్కర్‌రెడ్డి మా ట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్య ప్రతీ విద్యార్థి జీవితంలో కీలకమని చెప్పారు. ఈకార్యక్రమంలో డీన్లు శీలం శ్రీనివాసరెడ్డి, మధుబాబు, ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్, అశోక్, ప్రశాంత్, కాంతారావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
Published date : 28 Aug 2023 05:58PM