Skip to main content

‘ESCI’ సందర్శనకు రాష్ట్రపతి అంగీకారం

రాయదుర్గం: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్కీ) సందర్శనకు అంగీకరించి నట్టు సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రామేశ్వరరావు తెలిపా­రు.
Indian President Draupadi Murmu ESCI visit

ఆయన మే 14న‌ విలేక­రులతో మాట్లాడుతూ మే 13న‌ న్యూఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి ఆహ్వానించినట్టు తెలిపారు. గచ్చి­బౌలిలోని ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.

చదవండి: Engineering Colleges: ర్యాంకర్లూ కోసం... ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల వెతుకులాట..

ఈ సంద ర్భంగా ఎస్కీ పనితీరు, నిర్వహించే కోర్సులు, శిక్షణలపై రాష్ట్రపతికి వివరించినట్లు పేర్కొ న్నారు. జూలై చివరివారం లేదా ఆగస్టు మూడో వారంలో రావడానికి రాష్ట్రపతి సమ్మతించినట్లు తెలిపారు. 

Published date : 15 May 2024 11:26AM

Photo Stories