Skip to main content

AP EAPCET 2024: ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం.. ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు మాత్రం ఇలా..

విజయవాడ పశ్చిమ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రిక ల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్) - 2024 మే 16న‌ ప్రారంభమైంది.
AP EAPCET 2024 Exam Start

ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్‌లైన్) విధా నంలో నిర్వహించనున్నారు. తొలి దశలో రెండు రోజులపాటు అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీ రింగ్ స్ట్రీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

చదవండి: EAPCET - గైడెన్స్ | న్యూస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎంసెట్

తొమ్మిది కేంద్రాల్లో రోజూ ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి సుమారు గంటన్నర ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల | వరకు తొలి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో విడత పరీక్షలు జరిగాయి.

Published date : 17 May 2024 12:39PM

Photo Stories