Skip to main content

AP EAPCET 2024: ఏపీఈఏపీ సెట్ ప్రారంభం.. ప‌రీక్ష కేంద్రాల‌కు హాజ‌రైన‌వారి సంఖ్య ఇలా!

గురువారం ఏపీఈఏపీ సెట్ ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ప‌రీక్ష‌కు అధిక సంఖ్య‌లోనే హాజ‌రైయ్యారు..
Students attendance at first day of AP EAPCET 2024 entrance exam

కాకినాడ సిటీ: ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చరల్‌ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌ గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజున అగ్రికల్చరల్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించారు. కాకినాడ రీజియన్‌లో అయాన్‌ ఇనిస్టిట్యూట్‌ (అచ్యుతాపురం రైల్వే గేట్‌), సూరంపాలెంలోని ప్రగతి, ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రాంగణాల్లో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Gurukul Inter Admissions: అంబేడ్క‌ర్ గురుకులంలో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశానికి ప‌రీక్ష‌..

ఆయా కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. ప్రారంభ సమయంలో అక్కడక్కడ కొద్ది నిమిషాల పాటు సర్వర్‌ సమస్య మినహా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పరీక్షలు సజావుగా జరిగాయి. ఉదయం పరీక్షకు 921 మందికి 819 మంది, మధ్యాహ్నం పరీక్షకు 915 మందికి గాను 836 మంది హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం కలిపి 181 మంది గైర్హాజరవగా, 90.14 శాతం హాజరు నమోదైంది.

Stanford University Scholarships: ఏడుగురు భారత సంతతి విద్యార్థులకు ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్‌లు!

Published date : 17 May 2024 01:52PM

Photo Stories