Artificial Intelligence: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కీలకం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రస్తుత ఆధునిక వ్యవస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంతో కీలకంగా మారిందని, ప్రతి రంగంలో తనదైన ముద్ర వేస్తుందని ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీ అధ్యాపకులు ఆంజనేయులు అన్నారు.

జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ అనే అంశంపై ఏప్రిల్‌ 3న‌ నిర్వహించిన నేషనల్‌ వర్క్‌షాప్‌ నకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

చదవండి: AI skills: ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు ట్రైనింగ్.. ఎక్క‌డంటే..

విద్యారంగంలో ఏఐ ఆన్‌లైన్‌ విద్యలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, తరగతులు, పరీక్షల నిర్వహణలో ఏఐ అవసరం ఉందన్నారు. పరీక్షల అనంతరం ఒక్కో విద్యార్థి సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏఐ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విజయకుమార్‌, కోఆర్డినేటర్‌ విజయలక్ష్మి, గంగాధర్‌, సూరయ్య జబీన్‌ పాల్గొన్నారు.

#Tags