VITEEE 2024: విట్ ఈఈఈ 2024 ప్రవేశ పరీక్షలు ప్రారంభం.. ఫలితాల తేదీ!
తాడికొండ: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్‌లో విఐటి ఈఈఈ–2024 (పవేశ పరీక్షలు) శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 నుంచి 30 వరకు వెల్లూరు, చైన్నె, అమరావతి (ఆంధ్రప్రదేశ్), భోపాల్ క్యాంపస్‌లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీటెక్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం ప్రతి ఏటా కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారని, దేశ వ్యాప్తంగా 125 నగరాలు, విదేశాలలోని 6 నగరాలలోని పరీక్షా కేంద్రాల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు.
ఫలితాలు మే 3న తమ వెబ్‌సైట్‌లో ఉంటాయని వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎస్.వీ కోటారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మూడు స్లాట్లలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం విజయవాడ, గుంటూరు నుంచి బస్సులు ఏర్పాటు చేసినట్లు వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి తెలిపారు.
Tags
- Vellore Institute of Technology
- engineering entrance exam
- Students
- exam centers
- Entrance Tests
- results date
- Vice Chancellor Kota Reddy
- April 30
- Academic year
- Education News
- Sakshi Education News
- guntur news
- VITEEE 2024
- Arrangement completion
- Student support
- Examination process
- Exam Dates
- Entrance Exams
- VIT EEE-2024
- sakshieducation updates