RFCL Recruitment 2024: రామగుండం ఫెర్టిలైజర్స్‌లో 28 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(కెమికల్‌)-10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మెకానికల్‌)-06, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌)-03, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఇన్‌స్ట్రుమెంటేషన్‌)-02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)-03, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(లా)-01, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(హెచ్‌ఆర్‌)-03.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజనీరింగ్‌), ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా  ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 29.02.2024 నాటికి కనీస వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా గ్రాడ్యుయేట్లకు 25 ఏళ్లు, పీజీ అభ్యర్థులకు 29 ఏళ్లు మించకూడదు.
బేసిక్‌ పే: రూ.40,000 నుంచి రూ.1,40,000

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.03.2024

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in/

చదవండి: PNB Notification 2024: 1,025 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. రాత పరీక్ష.. ఇలా

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags