AP EAPCET 2024 Live Updates : ఏపీఈఏపీసెట్–2024కి ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఇవే.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ తేదీ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్–24కు ఇప్పటి వరకూ 3,05,724 దరఖాస్తులు వచ్చాయని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి ఏప్రిల్ 8వ తేదీన (సోమవారం) ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో వచ్చిన దరఖాస్తులు ఇవే..
ఇంజనీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాలకు కలిపి 892 చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. ఏవిధమైన ఫైన్ లేకుండా ఏప్రిల్ 15వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీలు రూ.550, ఎస్సీ, ఎస్టీలు రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రూ.500 ఫైన్‌తో ఈనెల 30 వరకూ, రూ.1,000 ఫైన్‌తో మే 5, రూ.5 వేల ఫైన్‌తో మే 10, రూ.10 వేల ఫైన్‌తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
చదవండి: AP EAPCET: కంప్యూటర్ సైన్స్ టాప్.. ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు
పరీక్షల తేదీలు ఇవే..
అగ్రికల్చర్, ఫార్మసీకి మే 16, 17 తేదీల్లోను, ఇంజనీరింగ్‌కు మే 18 నుంచి 22 వరకూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 47 ఆన్‌లైన్ సెంటర్లతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో చెరొక ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ నిర్వహిస్తామన్నారు. మే 7వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు 0884–2359599, 0884–2342499 హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించాలని కన్వీనర్ వెంకటరెడ్డి సూచించారు.
చదవండి: Paramedical Courses: ఈ కోర్సులో చేరితే.. కొలువు పక్కా! ఉద్యోగం కాదనుకుంటే...