AP EAPCET: కంప్యూటర్ సైన్స్ టాప్.. ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తి వివరాలు
రెండో స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మూడో స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ),
నాలుగో స్థానంలో మెకానికల్ ఇంజనీరింగ్ నిలిచాయి. కొత్తగా ప్రవేశపెట్టిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డిజైన్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల్లోనూ చేరికలు గతంలో కంటే పెరిగాయి. అయితే ఇంకా భర్తీ కాని సీట్లు కొన్ని విభాగాల్లో ఎక్కువగానే ఉన్నాయి.
కంప్యూటర్ సైన్స్ తోపాటు ఇతర కొత్త కోర్సుల్లో సీట్ల కేటాయింపు ఇలా..
కోర్సు |
ఇన్ టేక్ |
భర్తీ |
మిగులు |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ |
24,904 |
23,835 |
1,069 |
సీఎస్‌ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) |
3,846 |
3,369 |
477 |
సీఎస్‌ఈ (డేటా సైన్స్) |
2,772 |
2,328 |
444 |
సీఎస్‌ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) |
1,938 |
1,716 |
222 |
సీఎస్‌ఈ (సైబర్ సెక్యూరిటీ) |
900 |
785 |
115 |
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) |
564 |
440 |
124 |
సీఎస్‌ఈ (బిజినెస్ సిస్టమ్) |
381 |
375 |
6 |
సీఎస్‌ఈ (బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఐవోటీ సైబర్ సెక్యూరిటీ) |
357 |
350 |
7 |
సీఎస్‌ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్) |
288 |
266 |
22 |
సీఎస్‌ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ |
288 |
273 |
15 |
కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ |
288 |
284 |
4 |
సీఎస్‌ఈ డిజైన్ |
240 |
206 |
34 |
సైబర్ సెక్యూరిటీ |
162 |
100 |
62 |
కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ |
144 |
143 |
1 |
క్లౌడ్ కంప్యూటింగ్ స్పెషలైజేషన్ తో సీఎస్‌ఈ |
48 |
42 |
6 |
సీఎస్‌ఈ (ఐవోటీ, ఆటోమేషన్) |
48 |
8 |
40 |
సీఎస్‌ఈ (బిగ్ డేటా ఎనలిటిక్స్) |
24 |
24 |
0 |
కంప్యూటర్ నెట్‌వర్క్ |
21 |
21 |
0 |
సీఎస్‌ఈ బయోసైన్స్ |
21 |
20 |
1 |
కంప్యూటర్ ఇంజనీరింగ్ (సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్) |
21 |
20 |
1 |
తొలిసారి ‘బీ’ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు
గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్లు, మెరిట్తో సంబంధం లేకుండా తాము నిర్దేశించిన ఫీజును చెల్లించిన వారికి ఈ సీట్లను కేటాయించేవి. తద్వారా ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు వచ్చిన వారికి మొండిచేయి చూపేవి. పైగా రిజర్వేషన్లను కూడా అమలు చేసేవి కావు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేటగిరీల్లో ఆయా వర్గాలకు దక్కాల్సిన సీట్లు బయట విద్యార్థులకు దక్కేవి. ఫలితంగా నిరుపేద మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘బీ’ కేటగిరీ సీట్లను సైతం ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేయించింది. ‘బీ’ కేటగిరీలోని ఎన్ ఆర్ఐ కోటాలో మిగులు సీట్లు, నాన్ ఎన్ ఆర్ఐ కోటాలో సీట్లకు కలిపి కన్వీనరే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఈసారి ఆయా కళాశాలల్లో రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు అవకా>శం దక్కింది. ‘బీ’ కేటగిరీలో 13,564 మందికి సీట్లను కేటాయించారు.
మొత్తం 1,12,699 సీట్లు..
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం ఇన్ టేక్ 1,12,699 సీట్లుండగా 80,935 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఈ సీట్లలో అత్యధికం కంప్యూటర్ సైన్స్ లోనే ఉండగా భర్తీలోనూ ఇదే అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్‌ఈలో మొత్తం 24,904 సీట్లుండగా తొలి విడతలోనే 23,835 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా కేవలం 1,069 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈసీఈలో 23,977 సీట్లుండగా 20,275 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,702 సీట్లు మిగిలాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొత్తం 12,678 సీట్లకు 4,760 భర్తీ కాగా 7,918 మిగిలిపోయాయి. అదేవిధంగా ఈఈఈలో 10,931లో 6,410 సీట్లు భర్తీ కాగా 4,521 సీట్లు మిగిలాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో 9,904 సీట్లకు 4,455 సీట్లు భర్తీ కాగా 5,449 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
చదవండి:
GATE 2022: ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు
Online Attendance: విద్యార్థుల హాజరు నమోదుపై ఆన్ లైన్ పర్యవేక్షణ
Zonal System: పాత జిల్లాల ఉద్యోగులకు ఏయే కొత్త జిల్లాల్లో అర్హతో తెలుసుకోండి ఇలా..