TS DSC 2024 Exam Answer Key Mistakes : తెలంగాణ డీఎస్సీ-2024 'కీ' లో ఇన్ని త‌ప్పులా..? ఈ 18 ప్ర‌శ్న‌ల‌కు మార్కుల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ‌ తేదీ వరకు TS DSC 2024 ప‌రీక్ష‌లు జ‌రిగిన‌ విష‌యం తెల్సిందే. 11,062 టీచ‌ర్ ఉద్యోగాల‌కు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించారు.

అయితే ఈ ప్రాథమిక ‘కీ’లో లెక్కలేనన్ని త‌ప్పులు వ‌చ్చాయ‌ని అభ్య‌ర్థులు అంటున్నారు. అలాగే ఆన్సర్ కీ లో పలు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నట్లు స‌బ్జెక్ట్ నిపుణులు కూడా గుర్తించారు.

ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు..
రైట్‌ టూ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ఈ చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించినది ఆన్సర్‌ కీలో సమాధానం వచ్చింది. ప్రతిష్టాత్మకమైన డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా ఈ ప్రశ్నకు ఆప్షన్లుగా ఆర్టీఐ యాక్ట్‌, ఆర్సీఐ యాక్ట్‌, ఆర్టీఈ యాక్ట్‌, ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్‌ అని ఇచ్చారు. వాస్తవానికి ఒక్క ఆర్టీఐ యాక్ట్‌ తప్ప మిగతా చట్టాలన్నింటిని ప్రత్యేకావసరాలు గల వారి కోసం రూపొందించారు. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం ఆర్‌పీడబ్ల్యూడీ యాక్ట్‌ ఈ ప్రశ్నకు సరైన సమాధానంగా ఇచ్చారు. ఇది తప్పు అని అభ్యర్థులతోపాటు నిపుణులు ఆరోపిస్తున్నారు.

☛➤ TS DSC 2024 Results : టీఎస్ డీఎస్సీ -2024 ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! సెప్టెంబరు 5వ తేదీలోపు..

అలాగే ఈ ప్ర‌శ్న‌కు కూడా..
ADHD పూర్తి రూపం 'అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజాస్టర్‌’ దీనికి బదులుగా మాస్టర్‌ 'కీ'లో మాత్రం 'ఆటో డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజాస్టర్‌’ సరైన సమాధానంగా ప్రకటించారు. యూడీఎల్‌ ప్రధాన సూత్రం ఏదీ అన్న ప్రశ్నకు ఇచ్చిన ఆన్సర్‌పైనా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

ఈ 5 ప్రశ్నలకు సమాధానాలు ఇలానే తప్పుగా..
తెలుగు గ్రేడ్‌-1 పరీక్ష ప్రశ్నపత్రంలో 52వ ప్రశ్నగా 'గౌరీశ్వరులు అనే పదాన్ని విడదీయగా' అని ఇచ్చారు. దీనికి 71505321007 క్వశ్చన్‌ ఐడీ నంబర్‌ను కేటాయించారు. ఆప్షన్‌గా 2వ నంబర్‌ను పేర్కొన్నారు. అయితే కీ పత్రంలోని జవాబులో మాత్రం సరైన సమాధానంగా 4వ నంబర్‌(గ్రీన్‌ కలర్‌)తో గౌరీ+ఈశ్వరులు అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలో సరైన సమాధానం 2వ నంబర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. 'కీ' లో తెలుగు పండిత పరీక్షకు సంబంధించి 5 ప్రశ్నలకు సమాధానాలు ఇలానే తప్పుగా ఇచ్చారు.

డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో ఒకే పేపర్‌లో 18 వరకు తప్పులు..?
డీఎస్సీ-2024 ప్రశ్నపత్రాల్లో ఒకే పేపర్‌లో 18 వరకు తప్పులున్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. ప్రధానంగా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(స్కూల్‌ అసిస్టెంట్‌) పరీక్ష మాస్టర్‌ 'కీ'లో 160 ప్రశ్నలకు ఇచ్చిన ప్రాథమిక కీలో అత్యధిక తప్పులున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రశ్నపత్రం రూపకల్పనపైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. జీవో-4 ప్రకారం ఒక్కో విభాగం నుంచి 20 ప్రశ్నలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, అలా ఇవ్వలేదని, ఒక్క లర్నింగ్‌ డిసెబిలిటీలో 35 వరకు ప్రశ్నలిచ్చారని ఇది అత్యంత దారుణమని అభ్యర్థులు వాపోతున్నారు.

☛➤ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

స్పంద‌న క‌రువు.. క‌నీసం..
డీఎస్సీ-2024 'కీ' పత్రంపై అభ్యంతరాలు ఉంటే.. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చునని.., అవసరమైతే మెయిల్‌ లేదా ఫోన్‌ చేయవచ్చునంటూ మెయిల్‌ అడ్రస్‌లతో పాటు, ఫోన్‌ నంబర్లను సైతం ఇచ్చింది. ఫిర్యాదు చేసేందుకు యత్నిస్తే.. సరైన సమాధానం రావడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. 'కీ'లో వచ్చిన అంశాలపై ఆన్‌లైన్‌లో అభ్యంతరం వ్యక్తం చేయడానికి వీలు లేని పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. అభ్యంతరాలు లేవనెత్తడం ద్వారా సరైన సమాధానాన్ని సూచించవచ్చు. ఇందుకు ఆగస్టు 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. 

ఈ నెల చివ‌రిల్లో..
మొత్తం టీఎస్ డీఎస్సీకి 2,79,957 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 2,45,263 మంది (87.61) పరీక్షలకు హాజరయ్యారు. అలాగే టీఎస్ డీఎస్సీ-2024 ఫైన‌ల్ కీ త్వ‌ర‌లోనే విడుద‌ల చేసి.. ఫ‌లితాల‌ను ఈ నెల చివ‌రిలో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

➤☛ TS TET 2024 ALERT : టెట్ రాసిన అభ్య‌ర్థులు అల‌ర్ట్‌.. అలాగే డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు కూడా..

#Tags