Skip to main content

NMDC Junior Officer Jobs: NMDC లో భారీగా జూనియర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు జీతం 50వేలు

NMDC Junior Officer Jobs   NMDC Junior Officer Recruitment Notification   153 Junior Officer Vacancies at NMDC Hyderabad  Apply Online for NMDC Junior Officer Posts
NMDC Junior Officer Jobs

తెలంగాణ రాష్ట్రం - హైదరాబాద్‌ (Hyderabad) మసాబ్‌ట్యాంక్‌లోని నేషనల్‌ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC).. ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 153 జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. నవంబర్‌ 10 దరఖాస్తులకు చివరితేది. అలాగే.. అభ్యర్థులు పూర్తి వివరాలను సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ https://www.nmdc.co.in/ చూడొచ్చు.

గ్రామీణ కరెంట్‌ ఆఫీసుల్లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు జీతం 45వేలు: Click Here

మొత్తం జూనియర్ ఆఫీసర్ (ట్రైనీ) పోస్టులు: 153

విభాగాల వారీగా ఖాళీలు: కమర్షియల్-04, ఎన్విరాన్‌మెంట్-01, జియో అండ్ క్వాలిటీ కంట్రోల్-03, మైనింగ్‌- 56, సర్వే-09, కెమికల్- 04, సివిల్-09, ఎలక్ర్టికల్‌-44, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్- 03, మెకానికల్- 20 ఖాళీలు ఉన్నాయి.

విద్యా అర్హత:

పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, సీఏ/ఐసీఎంఏ, డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ (ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఇతర సమాచారం:

వయోపరిమితి: 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.37,000- రూ.1,30,000 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.250.. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 10, 2024.

Published date : 25 Oct 2024 08:29AM
PDF

Photo Stories