Good News For TS DSC 2024 Candidates: డీఎస్సీ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మీకు శుభ‌వార్త‌..

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ అభ్యర్థులకు కల్పించింది.

ఈ ఎడిట్ ఆప్షన్ డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.

ఎడిట్ ఆప్షన్ ఇందుకే..
గతంలో, చాలా మంది అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లో డీఎస్సీ పోస్టులు లేకపోవడంతో, ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం 11,000 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించడంతో, కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది.

ఈ పెరిగిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని చూసిన అభ్యర్థులకు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లుగా వెబ్‌సైట్ చూపించడంతో, చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, విద్యాశాఖ డీఎస్సీ దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఎడిట్ ఆప్షన్‌ను ఉపయోగించుకోండిలా..
డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి మీ వివరాలతో లాగిన్ అవ్వాలి. అనంత‌రం 'ఎడిట్ దరఖాస్తు' లింక్‌పై క్లిక్ చేసి మీరు సవరించాలనుకుంటున్న వివరాలను చూసి, 'సేవ్' బటన్‌పై క్లిక్ చేయండి.

TS DSC Notification 2024: 11,062 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌... పరీక్ష ఎప్పుడంటే

ముఖ్యమైన విషయాలు ఇవే..

  • ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • మీరు మీ దరఖాస్తును ఎడిట్ చేసిన తర్వాత, దాన్ని మళ్లీ ఎడిట్ చేయలేరు.
  • ఎడిట్ చేసిన తర్వాత, మీ దరఖాస్తును సమీక్షించి, ధృవీకరించడానికి డీఎస్సీ అధికారులకు కొంత సమయం పడుతుంది.
  • డీఎస్సీ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ గురించి మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ https://schooledu.telangana.gov.inను చూడండి. 

#Tags