DSC SGT Free Coaching: డీఎస్సీ, ఎస్జీటీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్ రూరల్: డీఎస్సీ ఎస్జీటీ ఉచిత శిక్షణకు ద రఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు, బీసీ స్టడీసర్కిల్ సెంటర్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈనెల 14 నుంచి 22 వరకు www. tsbcstudycircle. cgg. gov. in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.
చదవండి: డీఎస్సీ - టెట్ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్
రిజర్వేషన్, ఇంటర్, డైట్, టెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. 26 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాలకు ఫోన్ నంబర్ 08732–221280, 99496 84959 నంబర్లలో సంప్రదించాలన్నారు.
#Tags