Aman Sehrawat: యూడబ్ల్యూడబ్ల్యూ ర్యాకింగ్స్‌లో భారత స్టార్ రెజ్లర్ అమన్‌కు రెండో ర్యాంక్
పారిస్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావతత్ యునైటెడ్ వరట్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాకింగ్స్‌లో పురోగతి సాధించారు. ఆగస్టు 19వ తేదీ విడుదల చేసిన పురుషుల ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగం ర్యాంకింగ్స్‌లో అమన్ రెండో స్థానంలో నిలిచాడు. అమన్ ఖాతాలో 51,600 పాయింట్లున్నాయి.
ఈ ఏడాది అమన్ ఐదు టోర్నీల్లో పాల్గొని ఐదు పతకాలు సాధించడం విశేషం. ఓవరాల్‌గా 17 బౌట్‌లలో పోటీపడ్డ అమన్ 14 విజయాలు సాధించి, మూడు పరాజయాలు చవిచూశాడు. మొత్తం 163 పాయింట్లు స్కోరు చేసి, 54 పాయింట్లను ప్రత్యర్థులకు సమర్పించుకున్నాడు. జపాన్ రెజ్లర్, పారిస్ ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన రె హిగుచి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచాడు.
Paris Olympics: ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్
#Tags