Table Tennis Championship: భారత పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ జట్టుకు కాంస్యం

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడోసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 2021, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టుకు కాంస్య పతకాలు లభించాయి. కజకిస్తాన్‌లో అక్టోబ‌ర్ 10వ తేదీ జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు 0–3తో చైనీస్‌ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. 

తొలి మ్యాచ్‌లో శరత్‌ కమల్‌ 7–11, 10–12, 9–11తో లిన్‌ యున్‌ జు చేతిలో..  రెండో మ్యాచ్‌లో మానవ్‌ ఠక్కర్‌ 9–11, 11–8, 3–11, 11–13తో చెంగ్‌ జుయ్‌ చేతిలో.. మూడో మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 6–11, 9–11, 7–11తో హువాంగ్‌ యాన్‌ చెంగ్‌ చేతిలో ఓటమి చవిచూశారు.  

ISSF Junior World Championship: వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్న భారత షూటర్లు

#Tags