Nawaf Salam: లెబనాన్ ప్రధానిగా నవాఫ్ సలామ్
అంతర్జాతీయ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నవాఫ్ సలాం లెబనాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
![](https://education.sakshi.com/sites/default/files/images/2025/01/16/nawaf-salam-1737012811.jpg)
లెబనాన్ పార్లమెంటులో మెజారిటీ సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. గత 14 నెలలుగా ఇజ్రాయెల్‌తో పోరాటంలో పాల్గొన్న హెజ్‌బొల్లాకు ఇది ఒక శరాఘాతంగా భావిస్తున్నారు.
లెబనాన్‌లో మొత్తం 128 పార్లమెంటు స్థానాలున్నాయి, అందులో 73 మంది సభ్యులు జస్టిస్ నవాఫ్ సలాంకు మద్దతు ప్రకటించారు. ఈ మద్దతుతో ఆయన లెబనాన్ ప్రధాని పదవికి ఎంపికయ్యారు.
#Tags