Swachh Vayu Survekshan: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ఫలితాలు.. టాప్‌లో ఉన్న న‌గ‌రాలు ఇవే..

జైపూర్‌లో అంతర్జాతీయ స్వచ్ఛ వాయు దివాస్ ఘనంగా సెప్టెంబర్‌ 7వ తేదీ నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ నేతృత్వం వహించారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2024 ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఈ సర్వేలో గాలిలోని ధూళికణాల మెరుగుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ర్యాంకులు నిర్ణయించారు.

➣ ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 47 నగరాలు, 3 లక్షలలోపు జనాభా ఉన్న 130 నగరాలను పరిగణించారు.
 
➣ 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో.. విజయవాడకు 9వ, హైదరాబాద్‌ 25వ స్థానంలో నిలిచింది. సూరత్‌(గుజరాత్‌), జబల్‌పుర్‌(మధ్యప్రదేశ్‌), ఆగ్రా(ఉత్తర్‌ప్రదేశ్‌) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 
➣ 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఫిరోజాబాద్‌(ఉత్తర్‌ప్రదేశ్‌), అమరావతి(మహారాష్ట్ర), ఝాన్సీ(ఉత్తర్‌ప్రదేశ్‌).

Business Rankings: వ్యాపారం చేయడం సులభమైన జాబితాలో టాప్ 10లో ఉన్న రాష్ట్రాలివే.. ఏపీ

➣ 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో.. రాయ్‌బరేలి(ఉత్తర్‌ప్రదేశ్‌), నల్గొండ( తెలంగాణ), నలాగఢ్‌(హిమాచల్‌ప్రదేశ్‌) మొద‌టి మూడు స్థానాల్లో ఉన్నాయొ. సంగారెడ్డి 8వ స్థానంలోనూ నిలిచింది.  

➣ 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటించబడ్డాయి. గాలిలోని ధూళికణాల మొత్తం ఈ సర్వేలో ప్రధానంగా పరిగణించబడింది.

#Tags