IAS & IPS Salary Details : ఐఏఎస్‌, ఐపీఎస్‌కు ఎంత‌ జీతం ఇస్తారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి. అయినప్పటికీ దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు ప్రతి సంవత్సరం ఈ పరీక్షకు హాజరవుతారు.
ias and ips salary details

ఇందులో కొంతమంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించగలుగుతారు. అయితే వారిలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారులు అవుతారు. మన సమాజంలో ఈ అధికారుల‌కు ఎంతో గౌరవం ఉంటుంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐఆర్ఎస్ అధికారులు జీతం ఎంత, వారికి ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం.

☛ UPSC Exam Calendar 2024: విడుదలైన యూపీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌.. సివిల్స్‌ నుంచి సీడీఎస్‌ వరకూ వివిధ పరీక్షల తేదీలు..

ఏ త‌ల్లిదండ్రులైన మా వోడు బాగా చదివేసి కలెక్టరయిపోతాడని, లేదా ఐపీఎస్ అధికారి అయితే బాగుండని.. ప్రతి ఒక్క‌రు కోరుకుంటాడు. కలెక్టర్, ఎస్పీ అయితే హోదా వస్తుంది.. అలాగే మరి ఎక్కువ‌గా జీతం వస్తుంది ?  ఈ హోదాను చూసి జీతం ఎంతో .. ఊహించనంత ఉంటుందని అనుకుంటారు. నిజానికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌ ఆఫీసర్లకు నెలకు జీతాల‌తో అలవెన్స్ కింది విధంగా ఉంటాయి.

ఇండియా సివిల్ సర్వీసెస్ దేశం యొక్క పరిపాలనను నిర్వహిస్తుంది, ఎన్నికైన అధికారులతో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పౌర సేవకులు నిర్వహించే విధానాలను ఏర్పాటు చేస్తారు. ఈ పౌర సేవకులు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) ద్వారా ఎంపిక చేయబడతారు, ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా భారత ప్రభుత్వంలోని వివిధ సివిల్ సర్వీసెస్‌లో రిక్రూట్‌మెంట్ కోసం నిర్వహించబడుతుంది.

☛ Inspiring Success Story : బిచ్చగాళ్లతో రోడ్డుపై పడుకున్నా.. ఇంట‌ర్‌లో అన్ని సబ్జెక్ట్ లు ఫెయిల్.. ఈ క‌సితోనే నేడు ఐపీఎస్ అయ్యానిలా..

యూపీఎస్సీ పరీక్షలు.. భారతదేశంలో నిర్వహించే అత్యంత కఠినమైన పోటీ పరీక్షగా నిలిచింది. IAS, IPS, IFS మొదలైన మొత్తం 24 సివిల్ సర్వీసెస్‌లో కలిపి దాదాపు 1000 ఖాళీల కోసం దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతుంటారు. పౌర సేవలు మూడు విభాగాలుగా విభజించబడ్డాయి. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (CCS), స్టేట్ సివిల్ సర్వీసెస్.

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) వంటివి ఉన్నాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (CCS) నేరుగా భారత ప్రభుత్వ పరిపాలన ,శాశ్వత బ్యూరోక్రసీకి సంబంధించినది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ , స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది (SSC). రాష్ట్ర సివిల్ సర్వీసెస్ రాష్ట్ర సంబంధిత సమస్యలతో వ్యవహరిస్తుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లచే నియమించబడతాయి.

☛➤ Women IAS Success Story : ఫెయిల్ అవుతునే ఉన్నా.. కానీ ప్ర‌య‌త్నాన్ని మాత్రం ఆప‌లేదు.. చివ‌రికి ఐఏఎస్ కొట్టానిలా..

అయితే కష్టపడి చదవి.. IAS, IPS, IFSగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అధికారులు ఎంత సంపాదిస్తారో ఆలోచించారా? సివిల్ సర్వీస్ అధికారుల జీతాలు ఎంత ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

IAS అధికారి జీతం ఇలా..(ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్):

IAS ప్రారంభ వేతనం : రూ. 56,100

8 సంవత్సరాల సర్వీస్ తర్వాత : నెలకు రూ. 1,31,249 లేదా సంవత్సరానికి రూ. 15.75 లక్షలు

IAS గరిష్ట వేతనం : రూ.2,50,000

జీతంతో పాటు.. ఇవి కూడా క‌లిపి మొత్తం..

 

ఒక ఐఏఎస్‌ అధికారి జీతం గురించి మాట్లాడితే అతను ఏడో వేతన కమిషన్ కింద బేసిక్‌ వేతనంగా రూ.56,100 పొందుతాడు. ఇది కాకుండా ఐఏఎస్ అధికారులకు ట్రావెలింగ్ అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్‌తో సహా అనేక ఇతర అలవెన్సులు ఉంటాయి. మీడియా కథనాల ప్రకారం ఒక ఐఏఎస్ అధికారికి నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ జీతం వస్తుంది. అలాగే ఒక ఐఏఎస్ అధికారి క్యాబినెట్ సెక్రటరీ పదవికి చేరుకుంటే అతనికి నెలకు దాదాపు 2.5 లక్షల రూపాయల జీతం లభిస్తుంది.

సంవ‌త్స‌రానికి..

ఐఏఎస్ కెరీర్ ‌లో మొద‌టి సంవ‌త్స‌రం నుంచి 4వ సంవ‌త్స‌రం వ‌ర‌కు ప‌ని చేయాలి.ఇందులో వారికి బేసిక్ పే రూ.56,100 లభిస్తుంది, ఈ సమయలో ఏఎస్‌పీ, ఎస్‌డీఎం, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత 5వ సంవ‌త్స‌రం నుంచి 8వ సంవ‌త్స‌రం వ‌రకు డిప్యూటీ సెక్రెట‌రీ, అండ‌ర్ సెక్రెట‌రీ పోస్టులలో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇక ఆ సమయంలో రూ.67,700 జీతం అందుకుంటారు . ఇలా వారి పదవి కలం అనుసరించి జీతం పెరగడం, అలాగే ప్రమోషన్స్ ఇస్తారు. ఇక వారి కెరీర్‌లో 34వ‌ ఏడాది నుంచి 36వ ఏడాది వ‌ర‌కు పని చేస్తే చీఫ్ సెక్రెట‌రీగా పదివి పొందుతూ రూ.2.25 ల‌క్ష‌ల వేత‌నం పొందుతారు. అలాగే 37 ఏళ్ల‌కు పైగా కెరీర్ ఉన్న‌వారికి క్యాబినెట్ సెక్రెట‌రీ ఆఫ్ ఇండియా పోస్టు ఇవ్వడం జరుగుతుంది.

జీతం కాకుండా ఐఏఎస్‌ అధికారులకు ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వివిధ పే బ్యాండ్‌ల కింద పోస్ట్ ప్రకారం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందిస్తారు. ఇందులో జూనియర్ స్కేల్, సీనియర్ స్కేల్, సూపర్ టైమ్ స్కేల్ వంటి పే బ్యాండ్‌లు ఉంటాయి. బేసిక్‌ జీతం, గ్రేడ్ పే కాకుండా ఒక IAS అధికారి హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్ పొందుతారు. పే-బ్యాండ్ ఆధారంగా ఐఏఎస్ అధికారులకు ఇల్లు, వంట మనిషి, గృహ సిబ్బందితో సహా అనేక సౌకర్యాలు కల్పిస్తారు. ఒక ఐఏఎస్ అధికారి ఉద్యోగంలో భాగంగా ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే అక్కడ కూడా ప్రభుత్వ గృహం కేటాయిస్తారు. ఇది కాకుండా ఎక్కడికైనా ప్రయాణించడానికి కారు, డ్రైవర్ అందుబాటులో ఉంటారు. 

నిజానికి వారికి వచ్చే జీతం..

ఐఏఎస్‌ల జీతం ఇప్పుడు ఉన్న‌ ఐటీ ఉద్యోగుల కన్నా తక్కువే. ఐదు.. పదేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఐటీ ఉద్యోగులు.. రెండు, మూడు సంస్థలు మారితే.. ఏకంగా రూ.లక్ష జీతం దగ్గరకు చేరుకుంటున్నారు. సీనియార్టీ అలా పెరిగితే.. జీతం కూడా లక్షల్లో పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు టాలెంట్ ఉన్న ఐటీ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగికి రూ.రెండున్నర లక్షలు చాలా సులువుగా వస్తూ ఉంటాయి. వారికి అనేక సౌకర్యాలు కూడా ఉంటాయి. వారంలో ఐదు రోజులు వర్కింగ్ డేస్ తో పాటు.. ఇతర టెన్షన్లు ఉండవు.


IPS అధికారి జీతం ఇలా.. (ఇండియన్ పోలీస్ సర్వీస్):

IPS ప్రారంభ వేతనం: రూ. 56,100

8 సంవత్సరాల సర్వీస్ తర్వాత : నెలకు రూ. 1,31,100 లేదా సంవత్సరానికి రూ. 15.75 లక్షలు

IPS గరిష్ట వేతనం: రూ. 2,25,000

☛ IPS Success Story : ఓ 22 ఏళ్ల యువకుడు.. ఎలాంటి కోచింగ్ లేకుండానే.. తొలి ప్రయత్నంలోనే.. ఐపీఎస్ కొట్టాడిలా.. కానీ

☛ Sheshadrini Reddy IPS Success Story : ఆన్‌లైన్‌లో స్ట‌డీమెటీరియల్‌ ఫాలో అవుతూ.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సివిల్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి క‌నీస విద్యార్హ‌త డిగ్రీ. ఈ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేసి, ఐపీఎస్‌గా సెలెక్ట్ అయితే పై విధంగా జీతం ఉంటుంది. దీనికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం.

IFS అధికారి జీతం ఇలా..(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) :

ప్రారంభ వేతనం: రూ. 15,600-39,100

20 ఏళ్ల సర్వీస్ తర్వాత: నెలకు రూ. 37,400-67,000

గరిష్ట వేతనం: రూ. 90,000

☛ Inspiring Story : ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. ఐఎఫ్ఎస్‌ (IFS) ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించానిలా.. ఫస్ట్ అటెమ్ట్‌లోనే

☛ Success Story : సొంతూరికీ వెళ్ల‌కుండా చ‌దివా.. అనుకున్న ప్ర‌భుత్వ ఉద్యోగం కొట్టానిలా..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సివిల్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి క‌నీస విద్యార్హ‌త డిగ్రీ. ఈ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేసి,. ఐఎఫ్‌ఎస్‌గా సెలెక్ట్  అయితే పై విధంగా జీతం ఉంటుంది.. దీనికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం.

ఇండియ‌న్ ఫారిన్‌ స‌ర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) :

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప్ర‌తీ ఏడాది సివిల్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష రాయ‌డానికి క‌నీస విద్యార్హ‌త డిగ్రీ. ఈ ఎగ్జామ్‌ను క్లియ‌ర్ చేసి, ఐఎఫ్‌ఎస్‌గా సెలెక్ట్ అయిన వారికి నెల‌కు మూల వేత‌నం రూ.60,000 వ‌స్తుంది. దీనికి టీఏ, డీఏ, హెఆర్ఏ, అల‌వెన్స్‌లు అద‌నం.

➤☛ Success Story : ఒకే క‌ల‌.. ఒకే స్టడీ మెటిరీయల్ చ‌దువుతూ.. అక్కాచెల్లెళ్లిద్దరూ ఐఏఎస్ ఉద్యోగం కొట్టారిలా..

 Inspiring Success Story: ఆ రైతు ఇంట‌ ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అందరూ కలెక్టర్లే.. కానీ..

#Tags