Skip to main content

UPSC Exam Calendar 2024: విడుదలైన యూపీఎస్సీ జాబ్‌ క్యాలెండర్‌.. సివిల్స్‌ నుంచి సీడీఎస్‌ వరకూ వివిధ పరీక్షల తేదీలు..

దేశంలో అత్యున్నత నియామక సంస్థ.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ). జాతీయ స్థాయిలో ఏటా సివిల్స్‌తో పాటు పలు కేంద్ర సర్వీసులకు నియామక పరీక్షలను కమిషన్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. యూపీఎస్సీ తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించి వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్‌ విడుదల తేదీ, దరఖాస్తులకు చివరి తేదీలతోపాటు పరీక్ష తేదీలను సైతం ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. యూపీఎస్సీ ఎగ్జామ్‌ క్యాలెండర్‌-2024లో పేర్కొన్న పరీక్షల వివరాలు..
UPSC Exam Calendar 2024
  • సివిల్స్‌ నుంచి సీడీఎస్‌ వరకూ వివిధ పరీక్షల తేదీలు వెల్లడి
  • పరీక్షల నిర్వహణలో నిర్దిష్ట షెడ్యూల్‌ను అనుసరిస్తున్న యూపీఎస్సీ

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024

దేశంలోని సివిల్స్‌ వంటి ఉన్నత సర్వీసుల్లో చేరాలని కలలు కనే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి అత్యున్నత సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేసే మూడంచెల పరీక్ష.. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌! ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • నోటిఫికేషన్‌ తేది: 2024 ఫిబ్రవరి 14
  • దరఖాస్తుకు చివరితేది: 2024 మార్చి 5
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: 2024 మే 26
  • మెయిన్‌ ఎగ్జామినేషన్‌ తేది: 2024 సెప్టెంబర్‌ 20

చ‌ద‌వండి: Civils Practice Tests

ఎన్‌డీఏ,ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌- 2024

త్రివిధ దళాల్లో ఎంట్రీ లెవల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ), నేవల్‌ అకాడమీ(ఎన్‌ఏ) ఎగ్జామినేషన్‌. ఈ పరీక్ష ద్వారా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లోకి చురుకైన యువతను ఎంపిక చేసి.. శిక్షణనిచ్చి.. దేశ రక్షణలో భాగస్వాములను చేస్తారు. త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్‌ హోదా మొదలు.. జనరల్, అడ్మిరల్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వరకూ.. ఇలా.. వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా.. ఎన్‌డీఏ, ఎన్‌ఏలో శిక్షణ పొందిన వారే. ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఎన్‌డీఏ, ఎన్‌ఏలలో అడుగు పెట్టొచ్చు. ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. 

ఎన్‌డీఏ,ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌(1)-2024 తేదీలు:

  • నోటిఫికేషన్‌ తేది: 2023 డిసెంబర్‌ 20
  • దరఖాస్తుకు చివరితేది: 2024 జనవరి 9
  • పరీక్ష తేది: 2024 ఏప్రిల్‌ 21

ఎన్‌డీఏ,ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌(2)-2024 తేదీలు:

  • నోటిఫికేషన్‌ తేది: 2024 మే 15
  • దరఖాస్తుకు చివరి తేది: 2024 జూన్‌ 4
  • పరీక్ష తేది: 2024 సెప్టెంబర్‌ 1.

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌-2024

డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. కన్జర్వేటర్‌ వంటి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు మార్గం.. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌). ఐఎఫ్‌ఎస్‌ను కూడా ఆల్‌ ఇండియా సర్వీస్‌గానే పేర్కొంటారు. బీఎస్సీ, బీటెక్, అగ్రికల్చరల్‌ బీఎస్సీ తదితర సైన్స్, ఇంజనీరింగ్‌ డిగ్రీ అర్హతలతో ఈ పరీక్షకు పోటీపడొచ్చు.

  • నోటిఫికేషన్‌ తేది: 2024 ఫిబ్రవరి 14
  • దరఖాస్తుకు చివరి తేది: 2024 మార్చి 5
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: 2024 మే 26
  • మెయిన్‌ పరీక్ష తేది: 2024 నవంబర్‌ 24

చ‌ద‌వండి: Civils Prelims Study Material

ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024

ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు చక్కటి అవకాశం.. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(ఈఎస్‌ఈ). ఇందులో విజయం సాధిస్తే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నత కొలువు సొంతం చేసుకోవచ్చు. సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ తదితర విభాగాల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈఎస్‌ఈకి అర్హులు. 

  • నోటిఫికేషన్‌ తేది: 2023 సెప్టెంబర్‌ 6
  • దరఖాస్తుకు చివరి తేది: 2023 సెప్టెంబర్‌ 26
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: 2024 ఫిబ్రవరి 18
  • మెయిన్‌ పరీక్ష తేది: 2024 జూన్‌ 23

కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024

కేంద్ర జలవనరులు, గనుల మంత్రిత్వ శాఖల్లోని ఉన్నతస్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు మార్గం.. కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, కెమిస్ట్‌ హైడ్రోజియాలజిస్ట్‌ తదితర పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. జియలాజికల్‌ సైన్స్, జియాలజీ, అప్లయిడ్‌ జియాలజీ తదితర విభాగాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ పరీక్షకు అర్హులు. 

  • నోటిఫికేషన్‌ తేది: 2023 సెప్టెంబర్‌ 20
  • దరఖాస్తుకు చివరి తేది: 2023 అక్టోబర్‌ 10
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: 2024 ఫిబ్రవరి 18
  • మెయిన్‌ పరీక్ష తేది: 2024 జూన్‌ 22

సీడీఎస్‌ ఎగ్జామినేషన్‌-2024

త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్‌ ర్యాంకులో.. ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌(సీడీఎస్‌) ఎగ్జామినేషన్‌. ఇందులో విజయం సాధిస్తే..కొలువు ఖరారు కావడమే కాకుండా.. శిక్షణ సమయంలోనే ప్రతి నెలా స్టయిఫండ్‌ సైతం పొందొచ్చు. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో సీడీఎస్‌కు పోటీపడొచ్చు. ప్రతి ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు.

సీడీఎస్‌ ఎగ్జామినేషన్‌(1)-2024 తేదీలు:

  • నోటిఫికేషన్‌ తేది: 2023 డిసెంబర్‌ 20
  • దరఖాస్తుకు చివరితేది: 2024 జనవరి 9
  • పరీక్ష తేది: 2024 ఏప్రిల్‌ 21

సీడీఎస్‌ ఎగ్జామినేషన్‌(2)-2024 తేదీలు:

  • నోటిఫికేషన్‌ తేది: 2024 మే 15
  • దరఖాస్తుకు చివరి తేది: 2024 జూన్‌ 4
  • పరీక్ష తేది: 2024 సెప్టెంబర్‌ 1

చ‌ద‌వండి: Civils Prelims Guidance

ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌ 2024

ఐఈఎస్‌/ఐఎస్‌ఎస్‌ ఎగ్జామినేషన్‌ 2024 ద్వారా.. ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌(ఐఈఎస్‌), ఇండియన్‌ స్టాటిస్టికల్‌ సర్వీస్‌(ఐఎస్‌ఎస్‌)ల్లో చేరొచ్చు. ఎకనామిక్స్‌/అప్లైడ్‌ ఎకనామిక్స్‌/బిజినెస్‌ ఎకనామిక్స్‌/ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివిన వారు ఐఈఎస్‌కు; స్టాటిస్టిక్స్‌/మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌/ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌లో ఏదైనా ఒక సబ్జెక్టుతో బ్యాచిలర్‌ డిగ్రీ(లేదా) ఇవే సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ చదివిన వారు ఐఎస్‌ఎస్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • నోటిఫికేషన్‌ తేది: 2024 ఏప్రిల్‌ 10
  • దరఖాస్తుకు చివరి తేది: 2024 ఏప్రిల్‌ 30
  • పరీక్ష తేది: 2024 జూన్‌ 21.

కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024

కేంద్ర వైద్యారోగ్య సర్వీసుల్లో 'డాక్టర్లు'గా చేరేందుకు వీలుకల్పించే పరీక్ష.. కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీఎంఎస్‌ఈ). దీని ద్వారా ఇండియన్‌ రైల్వే, ఇండియన్‌ ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు, సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌ విభాగాల్లో.. 'మెడికల్‌ ఆఫీసర్‌' పోస్టులు భర్తీ చేస్తారు. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వారు సీఎంఎస్‌ఈకి దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • నోటిఫికేషన్‌ తేది: 2024 ఏప్రిల్‌ 10
  • దరఖాస్తుకు చివరితేది: 2024 ఏప్రిల్‌ 30
  • పరీక్ష తేది: 2024 జూలై 14.

చ‌ద‌వండి: Latest General Essays

సీఏపీఎఫ్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్స్‌) ఎగ్జామినేషన్‌-2024

బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌ తదితర కేంద్ర సాయుధ బలగాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్టుల్లో చేరేందుకు మార్గం..సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సీఏపీఎఫ్‌) (అసిస్టెంట్‌ కమాండెంట్స్‌) ఎగ్జామినేషన్‌. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ పరీక్షకు అర్హులు. 

  • నోటిఫికేషన్‌ తేది: 2024 ఏప్రిల్‌ 24
  • దరఖాస్తుకు చివరితేది: 2024 మే 14
  • పరీక్ష తేది: 2024 ఆగస్టు 4

 

  • వీటితోపాటు సీఐఎస్‌ఎఫ్‌ ఏసీ(ఈఎక్స్‌ఈ) ఎల్‌డీసీఈ-2024 నోటిఫికేషన్‌ 2023 నవంబర్‌ 29న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ 2023 డిసెంబర్‌ 19. పరీక్ష తేదీ 2024 మార్చి 10. అదేవిధంగా ఎస్‌.ఒ./స్టెనో(జీడీ-బి/జీడీ-1) ఎల్‌డీసీఈ-2024 నోటిఫికేషన్‌ 2024 సెప్టెంబర్‌ 11న వెలువడనుంది. దరఖాస్తులకు చివరి తేది 2024 అక్టోబర్‌ 1. పరీక్ష తేది 2024 డిసెంబర్‌ 07. అంతేకాకుండా యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(ఆర్‌టీ)ల కోసం 2024 జనవరి 13, ఫిబ్రవరి 24, మార్చి 9, జూలై 6, ఆగస్టు 10, అక్టోబర్‌ 19, డిసెంబర్‌ 21 తేదీలను రిజర్వ్‌ చేశారు. 
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

చ‌ద‌వండి: UPSC Jobs

Published date : 18 May 2023 06:01PM

Photo Stories